‘ఉస్సేన్ బోల్ట్‌లా వేగమే కాదు..మరో ప్రత్యేకత ఉంది’

‘ఉస్సేన్ బోల్ట్‌లా వేగమే కాదు..మరో ప్రత్యేకత ఉంది’

Updated On : February 15, 2020 / 7:59 AM IST

రాత్రికి రాత్రే స్టార్ అయిపోవడం ఒట్టి మాట. దాని వెనుక సంవత్సరాల కృషి దాగుందనేది దూరంగా ఉండే నిజం. కంబాలా రేసులో దున్నపోతులతో పాటు పరిగెత్తి ఉస్సేన్ బోల్ట్‌ను మించిన వేగాన్ని చూపించిన శ్రీనివాస గౌడ సోషల్ మీడియా కింగ్ అయిపోయాడు. రేసులో ఇంత వేగంగా ఉన్న వ్యక్తి నిజజీవితంలో మాత్రం చాలా హుందాతనంగా కామ్ గోయింగ్ పర్సన్ అంటే నమ్మగలరా.. 

దక్షిణ కన్నడ జిల్లాలోని మూడబిద్రికి చెందిన శ్రీనివాస్ గౌడ(28) 142.5మీటర్లు 13.62సెకన్లలో పూర్తి చేశాడు. ఉస్సేన్ బోల్ట్ 100మీటర్లు పరిగెత్తడానికి 9.58సెకన్ల సమయం తీసుకుంటే కంబాల శ్రీనివాస్ 9.55సెకన్లలోనే అంత దూరాన్ని దాటేశాడు. 

‘ప్రజలంతా నన్ను ఉస్సేన్ బోల్ట్‌తో పోలుస్తున్నారు. అతను ప్రపంచ చాంపియన్. నేను కేవలం నీళ్లు ఉన్న మడుల్లోనే పరిగెత్తగలను’ అంటూ ఏ మాత్రం గర్వం లేకుండా స్థిరంగా నిల్చొని చెప్పాడు. 

రణదీప్ హుడా, ఆనంద్ మహీంద్రా లాంటి సెలబ్రిటీలు క్రీడా మంత్రి కిరణ్ రిజూకు ఇలాంటి వాళ్లు ఒలింపిక్స్ కు వెళ్లాలంటూ సిఫారసు చేశారు. దానిపై స్పందించిన మంత్రి కూడా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆప్ ఇండియా కోచెస్‌ను అతణ్ని సంప్రదించమని చెప్తానని చెప్పారు. 

అయినప్పటికీ అతనిలో కించిత గర్వం కూడా లేకుండా సామాన్యంగా కనిపించాడని ఇంగ్లీష్ మీడియా చెప్పుకొచ్చింది. ఎట్టకేలకు శ్రీనివాస్ గౌడకు అంతర్జాతీయ ప్లాట్ ఫాంపై ప్రతిభ చూపే అవకాశం దక్కించుకున్నాడు. కంబాలా జాకీగా అవడమే తన కోరికని దాని కోసం చిన్న వయస్సులోనే చదువు మానేసినట్లు చెప్పాడు. కంబాలా రేసులో 12సార్లు గెలిచి 29అవార్డులు దక్కించుకున్నాడు. 

Read Here>>మెరుపు వేగం : ఉసేన్ బోల్ట్ రికార్డ్ ను బద్దలుకొట్టిన భారతీయుడు