భారత్‌ను టచ్ చేయాలంటే గజగజ వణకాల్సిందే..! డిఫెన్స్ అమ్ములపొదిలో పవర్ ఫుల్ ఆయుధాలు..

ఎప్పుడు ఏ యుద్ధం ఎక్కడి నుంచి వస్తుందో, ఎప్పుడు ఎవరిని ఢీకొట్టాలో అంచనా వేయలేకుండా ఉంది.

భారత్‌ను టచ్ చేయాలంటే గజగజ వణకాల్సిందే..! డిఫెన్స్ అమ్ములపొదిలో పవర్ ఫుల్ ఆయుధాలు..

Updated On : October 12, 2024 / 1:16 AM IST

Indias Defence : దసరా అంటే.. ఆయుధ పూజ. ఈ పండుగ పూట మన దేశం ఆయుధ పూజకు సిద్ధమైంది. శత్రువుల వెన్నులో వణుకు పుట్టించే ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటోంది. డిఫెన్స్ అమ్ముల పొదిలోకి సరికొత్త అస్త్రాలు వచ్చి చేరుతున్నాయి. వాటి గురించి తెలిస్తే.. వంకర చూపులు చూడటం కాదు కదా.. ఆ ఆలోచన రావాలన్నా శత్రువుకు వణుకు పుట్టాల్సిందే.

ఓవైపు చైనా కుతంత్రాలు, మరోవైపు పాకిస్తాన్ కుక్కతోక కుట్రలు.. ఇంకోవైపు అంతర్జాతీయ యుద్ధాలు.. ఈ పరిణామాలతో రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా మన డిఫెన్స్ అమ్ముల పొదిలోకి ఇప్పుడు సరికొత్త అస్త్రాలు వచ్చి చేరుతున్నాయి. అయితే, శత్రువుల పీచమణిచేలా డిఫెన్స్ లోకి కొత్తగా వచ్చి చేరిన ఆయుధాలు ఏంటి? వాటి స్పెషాలిటీ ఏంటి?

శాంతి కావాలంటే ఆయుధం ఉండాల్సిందే. శత్రువును భయపెట్టాల్సిందే. ఇలానే తయారయ్యాయి ప్రపంచ పరిణామాలు. రష్యా-యుక్రెయిన్ యుద్ధం ఓవైపు.. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తలు మరోవైపు.. నక్కల్లా తొంగి చూస్తున్న పాక్-చైనాలు ఇంకోవైపు.. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఏం జరిగినా.. ప్రమాదం ఎక్కడి నుంచి దూసుకొచ్చినా, అప్రమత్తంగా ఉండేలా భారత్ అలర్ట్ అవుతోంది. రక్షణ రంగాన్ని రోజురోజుకి మరింత బలోపేతం చేస్తోంది. త్రివిధ దళాలను సూపర్ స్ట్రాంగ్ చేస్తోంది. అందులో భాగంగా రక్షణ రంగం అమ్ములపొదిలోకి సరికొత్త అస్త్రాలు వచ్చి చేరాయి. మేకిన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా అనే ట్యాగ్ తో రెడీ కాబోతున్న ఈ ఆయుధాలు శత్రువు వెన్నులో వణుకు పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తతలే. ఎప్పుడు ఏ యుద్ధం ఎక్కడి నుంచి వస్తుందో, ఎప్పుడు ఎవరిని ఢీకొట్టాలో అంచనా వేయలేకుండా ఉంది. అయితే, ఎలాంటి పరిస్థితులు వచ్చినా రెడీగా ఉండాలని రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తోంది భారత్. కేటాయింపుల నుంచి కొనుగోళ్ల వరకు అద్భుతమైన వ్యూహాలు రచిస్తోంది. బలాన్ని పెంచుకోవడంతో పాటు మరికొన్ని దేశాలతో బలంగా ఉంటోంది.

Also Read : అమెజాన్ ఇండియాపై రిగ్గింగ్ ఆరోపణలు.. ఒకే వ్యక్తికి 10ఏళ్లుగా ఆన్‌లైన్ కాంటెస్టుల్లో బహుమతులు..!