Amazon India Backlash : అమెజాన్ ఇండియాపై రిగ్గింగ్ ఆరోపణలు.. ఒకే వ్యక్తికి 10ఏళ్లుగా ఆన్‌లైన్ కాంటెస్టుల్లో బహుమతులు..!

Amazon India Backlash : చిరాగ్ గుప్తా అనే వ్యక్తికి అనుకూలంగా రిగ్గింగ్ పోటీలకు పాల్పడినట్లు అమెజాన్ ఇండియాపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకిత వ్యక్తమవుతోంది. 

Amazon India Backlash : అమెజాన్ ఇండియాపై రిగ్గింగ్ ఆరోపణలు.. ఒకే వ్యక్తికి 10ఏళ్లుగా ఆన్‌లైన్ కాంటెస్టుల్లో బహుమతులు..!

Amazon India faces backlash ( Image Source : Google )

Updated On : October 12, 2024 / 12:39 AM IST

Amazon India Backlash : ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా ఆన్‌లైన్ ప్రమోషనల్ కాంటెస్ట్‌లకు సంబంధించి వివాదంలో చిక్కుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా అమెజాన్ ఇండియా వినియోగదారులను ఆకర్షించేందుకు ఆన్‌లైన్ ప్రమోషనల్ కాంటెస్ట్‌లను నిర్వహిస్తోంది. అయితే, ప్రతిసారి నిర్వహించే పోటీల్లో ఒకే వ్యక్తి ఎక్కువ మొత్తంలో బహుమతులు గెలుచుకుంటున్నారు.

గత దశాబ్దంలో కనీసం 6 అమెజాన్ బహుమతులను చిరాగ్ గుప్తా అనే వ్యక్తి గెలుచుకున్నాడు. ఇప్పుడు ఇదే అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతేకాదు.. చాలామందిలో ఒకే వ్యక్తికి అన్నిసార్లు బహుమతులు రావడం ఏంటి? అనే అనుమానం వ్యక్తమవుతోంది. పదేళ్లలో నిర్వహించిన అన్ని క్యాంపెయిన్స్ ఆ వ్యక్తికి అనుకూలంగా పోటీలను రిగ్గింగ్ చేసినట్టు అమెజాన్ ఇండియాపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఇప్పటివరకూ అమెజాన్ ఇండియా నుంచి ఎలాంటి స్పందన లేదు.

Read Also : Poco C75 Launch : పోకో సి75 గ్లోబల్ వేరియంట్ వస్తోంది.. 3 కలర్ ఆప్షన్లలో.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

ఒక్కడే అన్నిసార్లు ఎలా గెలుస్తారు?..
అమెజాన్ ఇండియా ప్రమోషనల్ కాంటెస్ట్‌ల్లో భాగంగా అనేక బహుమతులతో పోటీలను తరచుగా నిర్వహిస్తుంది. ఇందులో పాల్గొనేవారు అమెజాన్ గిఫ్ట్ కార్డ్‌లు, గాడ్జెట్‌లు, ఇతర బహుమతులను గెలుచుకునే అవకాశం ఉంది. ప్రతి పోటీలో వేలాది మంది పాల్గొంటారు. అయితే, ఒక వ్యక్తి అనేక వేర్వేరు పోటీలలో గెలుపొందడం అసాధ్యం.

అంటే.. అమెజాన్ ఇండియా పక్షపాతంగా వ్యవహరించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా అదృష్టవంతులు అయితే ఒక వ్యక్తి ఒకటి లేదా రెండు సార్లు పోటీల్లో గెలవవచ్చు.. కానీ, ప్రతిసారి పోటీల్లో గెలవడం చూస్తుంటే.. అమెజాన్ ఇండియా రిగ్గింగ్ పోటీలను నిర్వహించదనే అనుమానం చాలామంది యూజర్లలో వ్యక్తమైంది. చిరాగ్ గుప్తా నిరంతరం పోటీల్లో గెలుపొందడం కూడా అందరిలో సందేహాలను రేకెత్తిస్తోంది.

చిరాగ్ గుప్తాను విజేతగా ప్రకటించిన అమెజాన్ :
ఇటీవలే చిరాగ్ గుప్తాకు సంబంధించి ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. వరుసగా అదృష్టంతో చిరాగ్ గుప్తా విజయాల పరంపర అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ నెల 8న అమెజాన్ ఇండియా అధికారిక X అకౌంట్లో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ‘Apple Macbook Air M1’ పోటీలో చిరాగ్ గుప్తాను విజేతగా ప్రకటించింది.

దీనిపై ఎక్స్ యూజర్ “@Crypt0holicpoet” అమెజాన్ ఇండియాను పక్షపాతంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ రీపోస్టు చేశారు. చిరాగ్ గుప్తా అనే వ్యక్తి అమెజాన్ పోటీల్లో గెలివడంపై అనుమానం వ్యక్తం చేశారు. “ఈ నిర్వాహకులు అంతర్గత వ్యక్తులు. తమ స్నేహితుల సర్కిల్ నుంచి విజేతలను ఎన్నుకుంటారు. ఆపై కమీషన్ తీసుకుంటారు. నేను ఒక ఏడాది నుంచి ఇది గమనిస్తున్నాను ”అని ఆ యూజర్ మండిపడ్డారు.

2014 నుంచి ఆన్‌లైన్ పోటీల్లో గెలుస్తున్న చిరాగ్ గుప్తా :
చిరాగ్ గుప్తా.. గత దశాబ్ద కాలంగా అమెజాన్ పోటీల్లో అనేక బహుమతులు గెలుచుకున్నారు. 10 సంవత్సరాల కాలంలో అమెజాన్ పోటీలను గెలుస్తున్నారని పోస్ట్‌లో ఉంది. అతడి ఫ్యాషన్ హాంపర్, వన్ ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ, రూ. 1,000 విలువైన గిఫ్ట్ కార్డ్, అనేక ఇతర బహుమతులను గెలుచుకున్నాడు. గుప్తా కొన్నిసార్లు పోటీలో ఏకైక విజేతగా ప్రకటించింది.

కొన్నిసార్లు ఇతర పాల్గొనేవారితో కలిసి కూడా గుప్తా గెలిచారు. ఇ-కామర్స్ దిగ్గజం ఒక వ్యక్తికి ప్రయోజనం చేకూర్చడానికి నకిలీ బహుమతులను హోస్ట్ చేసిందని డజన్ల కొద్దీ కస్టమర్‌లు ఆరోపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో అమెజాన్‌ ఇండియాపై తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది.

రిగ్గింగ్ పోటీలా.. మండిపడుతున్న నెటిజన్లు :
దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. అమెజాన్ ఇండియా రిగ్గింగ్ పోటీలను నిర్వహించందంటూ ఆరోపిస్తున్నారు. “ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఒక వ్యక్తి గత 10 ఏళ్ల నుంచి అనేక సార్లు అమెజాన్ బహుమతిని గెలుచుకున్నారు. యాదృచ్చికంగా కాదు” అని ఒక యూజర్ మండిపడ్డారు. ‘@Crypt0holicpoet’ అనే యూజర్ పోస్ట్ చేసిన తర్వాత చాలా మంది పోస్ట్‌కి ప్రతిస్పందించారు.

ఒక యూజర్ “వావ్ సోదరా.. మీరు గొప్ప పని చేసారు. @amazonIN దయచేసి దీన్ని గమనించండి. మీరు ప్రతిసారీ ఒకరిని మాత్రమే విజేతగా చేయాలనుకుంటే.. దయచేసి ముందుగా మాకు తెలియజేయండి. మేము మా సమయాన్ని వృధా చేయం” అంటూ పోస్టు పెట్టారు.

Read Also : iPhone 15 Discount : కొత్త ఐఫోన్ కొంటున్నారా? ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.27వేలు తగ్గింపు.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే..!