SBI Report : Q1లో దేశ జీడీపీ వృద్ధి 18.5శాతంగా అంచనా వేసిన ఎస్బీఐ

భారత స్థూల దేశీయోత్పత్తి (GDP)ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి త్రైమాసికంలో దాదాపు 18.5 శాతం ఉండవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అంచనా వేసింది.

SBI Report : Q1లో దేశ  జీడీపీ వృద్ధి 18.5శాతంగా అంచనా వేసిన ఎస్బీఐ

Sbi

Updated On : August 24, 2021 / 3:40 PM IST

SBI Report  భారత స్థూల దేశీయోత్పత్తి (GDP)ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి త్రైమాసికంలో దాదాపు 18.5 శాతం ఉండవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అంచనా వేసింది. ఎస్బీఐ విడుదల చేసిన ఇకోరాప్ రీసెర్చ్ రిపోర్టు ప్రకారం…నౌకాస్టింగ్ మోడల్ ఆధారంగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-జూన్ క్వార్టర్ లో దేశ జీడీపీ వృద్ధి 18.5 శాతం ఉంటుందని అంచనా వేసింది.  2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో గ్రాస్ వాల్యూ యాడెడ్ (జీవీఏ) 15 శాతం అని ఈ నివేదిక అంచనా వేసింది.

41 హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్స్‌తో నౌకాస్టింగ్ మోడల్‌ను ఎస్‌బీఐ రూపొందించింది. పారిశ్రామిక కార్యకలాపాలు, సేవా రంగం కార్యకలాపాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వంటివాటి ఆధారంగా దీనిని రూపొందించింది.

అయితే ఎస్బీఐ అంచనా.. భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) అంచనా కన్నా తక్కువ కావడం గమనార్హం. RBI మాత్రం ఏప్రిల్-జూన్ క్వార్టర్ లో జీడీపీ వృద్ధి రేటు 21.4 శాతం ఉంటుందని అంచనా వేసిన విషయం తెలిసిందే.