Ground Water : భారతదేశంలో భూగర్భజలాల క్షీణతపై ఐక్యరాజ్యసమితి సంచలన నివేదిక

భారతదేశంలో భూగర్భ జలాలపై ఐక్యరాజ్యసమితి గురువారం సంచలన నివేదిక విడుదల చేసింది. భారతదేశంలోని పలు ప్రాంతాల్లో 2025వ సంవత్సరం నాటికి భూగర్భజలాల సంక్షోభం ఏర్పడనుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది....

Ground Water

Ground Water : భారతదేశంలో భూగర్భ జలాలపై ఐక్యరాజ్యసమితి గురువారం సంచలన నివేదిక విడుదల చేసింది. భారతదేశంలోని పలు ప్రాంతాల్లో 2025వ సంవత్సరం నాటికి భూగర్భజలాల సంక్షోభం ఏర్పడనుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ఇండో-గంగా నది పరీవాహక ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే భూగర్భ జలాల క్షీణించాయని ఇంటర్‌కనెక్టడ్ డిజాస్టర్ రిస్క్ రిపోర్ట్ 2023 పేరుతో ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం – ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ అండ్ హ్యూమన్ సెక్యూరిటీ ప్రచురించిన నివేదిక వెల్లడించింది.

Also Read : Kannada actor Darshan : వెలుగుచూసిన కన్నడ నటుడి పులిగోరు ఫొటోలు…అటవీశాఖ అధికారుల సోదాలు

భూగర్భజలాల క్షీణత, పర్వత హిమానీనదం కరిగిపోవడం. , అంతరిక్ష వ్యర్థాలు, భరించలేని వేడితో భూగర్భజలాలు అడుగంటాయని నివేదిక తెలిపింది. భూగర్భ జలాల్లో 70 శాతం వ్యవసాయం కోసం ఉపయోగిస్తున్నారు. దీంతో ఉన్న భూగర్భజలాలు అంతరించి పోతున్నాయి. కరవు పరిస్థితుల వల్ల జలాశయాలు సైతం ఎండిపోతున్నాయని యూఎన్ నివేదిక పేర్కొంది. జలాశయాల్లో నీటిమట్టాలు గణనీయంగా తగ్గుతున్నాయి.

Also Read : Former Uttarakhand C.M : కారు ప్రమాదంలో మాజీ ముఖ్యమంత్రికి గాయాలు

దీనికితోడు బావుల్లో నీటిమట్టం పడిపోతోంది. భూగర్భ నీటిమట్టాలు తగ్గిపోతే రైతలు నీటి లభ్యతను కోల్పోవచ్చు. దీంతో ఆహార ఉత్పత్తి వ్యవస్థకు ప్రమాదం ఏర్పడే అవకాశముందని నివేదిక తేల్చి చెప్పింది. ఇప్పటికే సౌదీ అరేబియా వంటి పలు దేశాలు భూగర్భజలాల కొరతను ఎదుర్కొంటున్నాయి. అమెరికా, చైనా దేశాల కంటే భారతదేశంలో భూగర్భజలాల వినియోగం అధికం.

Also Read :  Earthquake : అఫ్ఘానిస్థాన్ దేశంలో మళ్లీ నాల్గవసారి భూకంపం

భారతదేశంలోని 1.4 బిలియన్ల మంది ప్రజలకు భూగర్భజల వనరులతో పంటలు పండిస్తున్నారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో వరి, గోధుమ పంటలు పండిస్తున్నారు. పంజాబ్ రాష్ట్రంలో 78 శాతం బావుల నుంచి భూగర్భజలాలను తోడి రైతులు సేద్యం చేస్తున్నారు. 2025వ సంవత్సరం నాటికి భూగర్భజలాల లభ్యత తగ్గుతుందని నివేదిక తేటతెల్లం చేసింది. భూగర్భజలాలు తగ్గిపోతే పెనుముప్పు తప్పదని ప్రపంచ నిపుణులు జాక్ ఓ కానర్ చెప్పారు.

Also Read : T Congress : రేపు టీ కాంగ్రెస్ రెండో జాబితా విడుదల.. 40 మంది అభ్యర్థులకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్

ట్రెండింగ్ వార్తలు