భారత్ లో 4ఏళ్లలో 60శాతం పెరిగిన చిరుతపులుల సంఖ్య

India’s leopard population increases భారత్ లో చిరుతపులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. నాలుగేళ్లలో చిరుత పులుల సంఖ్య 60శాతం పెరిగింది. 2014లో చిరుత పులుల సంఖ్య 8,000 ఉండగా…2018నాటికి వాటి సంఖ్య 12,852కి చేరిందని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ తెలిపారు.

సోమవారం(డిసెంబర్-21,2020)అటవీశాఖ అధికారుల సమక్షంలో ఢిల్లీలో ‘Status of Leopards in India 2018′ రిపోర్ట్ విడుదల చేసిన ప్రకాష్ జావదేకర్..చిరుతపులల సంఖ్యలో పెరుగుదల ఉందని, అదేవిధంగా పులులు,సింహాల సంఖ్య కూడా పెరుగుతోందని అన్నారు. జీవావరణాన్ని మరియు జీవ వైవిధ్యాన్ని భారత్ కాపాడుతోందని ఇది తెలియజేస్తోందని ఆయన అన్నారు.

ఇవాళ ప్రకాష్ జావదేకర్ విడుదల చేసిన రిపోర్ట్ లో ముఖ్యమైన అంశాలు

– కెమెరా ట్రాపింగ్ పద్ధతిని ఉపయోగించి చిరుతపులుల సంఖ్యని అంచనావేయడం జరిగింది.

– భారత్ లో ఎక్కువగా చిరుతపులు మధ్యప్రదేశ్ లో(3,421),కర్ణాటక(1,783),మహారాష్ట్ర(1,690)లో ఉన్నాయి.

– 2014నుంచి 60శాతం పెరిగి..2018 వరకు భారత్ లో 12,852 చిరుతపులులు ఉన్నాయి.

-48-67శాతం వరకు ఆఫ్రికాలో మరియు 83-87శాతం ఆసియాలో వీటి సంఖ్య తగ్గినట్లు తాజా మీటా విశ్లేషణ సూచించింది.

-గడిచిన 120-200 ఏళ్లల్లో మానవప్రేరిపిత చర్యల కారణంగా 75-80శాతం చిరుతపులుల సంఖ్య తగ్గింది.

-భారత ఉపఖండంలో వేటాడటం,నివాస సౌకర్యం కోల్పోవడం,సాధారణ ఆహారంలో కొరత మరియు ఘర్షణ..ఇవన్నీ చిరుతపులల పాపులేషన్ కి పెద్ద సవాళ్లు
-వీటన్నింటి ఫలితంగా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్(IUCN)… చిరుతపులలను NEAR Threatened(భయపెట్టేందుకు సమీపంలో)నుంచి Vulnerable(హానికారమైది)గా ప్రకటించింది.

-ప్రాంతాలవారీగా చూస్తే…మధ్యప్రదేశ్,మహారాష్ట్ర,రాజస్తాన్,ఛత్తీస్ ఘడ్,ఒడిషా,జార్ఖండ్,తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కలిపి సెంట్రల్ ఇండియా మరియు ఈస్ట్రన్ ఘాట్స్ లో అత్యధిక సంఖ్యలో 8,071 చిరుతపులులు ఉన్నాయి.

-వెస్ట్రన్ ఘాట్ రీజియన్ తో కూడిన కర్నాటక,తమిళనాడు,గోవా,కేరళలో 3,387 చిరుతపులులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్,ఉత్తరాఖండ్,బీహార్ లతో కూడిన శివాలిక్ అండ్ గంగేటిక్ మైదాన ప్రాంతాల్లో 1,253చిరుతపులులు ఉన్నాయి.

-నార్త్ ఈస్ట్ హిల్స్(ఈశాన్య కొండల్లో)లో కేవలం 141చిరుతపులులు మాత్రమే ఉన్నాయి.