Gold Imports
Gold Imports : బంగారానికి ప్రపంచవ్యాప్తంగా ఫుల్ డిమాండ్ ఉంది. దాన్ని ఖరీదైన ఆభరణంగానే కాదు.. సేఫ్ ఇన్వెస్ట్ మెంట్ గా కూడా చూస్తారు. అందుకే పసిడికి అంత గిరాకీ. ఇక భారతీయుల విషయానికి వస్తే పుత్తడి అంటే మరింత మమకారం. మరీ ముఖ్యంగా మగువలకు. గోల్డ్ అంటే ప్రాణం. అకేషన్ ఏదైనా వచ్చిందంటే చాలు పసిడి కొనేందుకు రెడీ అయిపోతారు. ఇక పెళ్లిళ్లు, పండుగలు వచ్చాయంటే కచ్చితంగా గోల్డ్ కొనాల్సిందే. ఇలా పుత్తడితో భారతీయులకు విడదీయలేని బంధం ఉంది.
ఇకపోతే పండుగల సీజన్ ప్రారంభమైంది. దీంతో మహిళలు బంగారం, ఆభరణాల కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌లో బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే గత నెలలో 658 శాతం దిగుమతులు పెరిగాయి. 2020 ఆగస్టులో ఔన్స్ బంగారం ధర 2072 డాలర్లకు పెరిగి ఆల్‌టైం రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం 15 శాతం తగ్గింది. అయితే, బంగారం దిగుమతులు పెరగడంతో దేశీయ వాణిజ్య లోటు పెరిగిపోయింది. ఫలితంగా రూపాయికి డాలర్ కు మధ్య అంతరం పెరిగింది.
Android Apps : మొబైల్ యూజర్లకు వార్నింగ్.. వెంటనే ఈ 26 యాప్స్ డిలీట్ చేయండి..
గతేడాదితో పోలిస్తే గత నెలలో బంగారం దిగుమతులు 91 టన్నులు పెరిగాయి. గతేడాది కేవలం 12 టన్నులు మాత్రమే దిగుమతి అయ్యింది. ఇక విలువ పరంగా గతేడాది సెప్టెంబర్‌లో దిగుమతైన బంగారం విలువ 601 మిలియన్ల డాలర్లు అయితే, ఈ ఏడాది 5.1 బిలియన్ల డాలర్లకు పెరిగింది.
సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో బంగారం దిగుమతులు 170 శాతం పెరిగి 288 టన్నులకు చేరాయి. లోకల్ గోల్డ్ ఫ్యూచర్స్ పది గ్రాముల బంగారం ధర రూ.45,479 (611.93 డాలర్లు)కు పడిపోయింది.
Flubot Malware : సెక్యూరిటీ అప్‌డేట్ అని మేసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త.. క్లిక్ చేస్తే ఖతమే
ఇక అక్టోబర్ లో బంగారం దిగుమతులు 100 టన్నులకు పైగా పెరగొచ్చని అంచనా వేశారు. గతేడాది అక్టోబర్ లో 45 టన్నుల బంగారం దిగుమతి అయ్యింది. ధర మాత్రం స్థిరంగానే(రూ.46,300) గా ఉండొచ్చని వ్యాపారులు తెలిపారు. ప్రస్తుతం కరోనా వైరస్ కొత్త కేసులు తగ్గుతున్నాయి. దీంతో కరోనా భయం తగ్గింది. ఈ కారణంగా రిటైల్ వినియోగదారులు బంగారం కొనుగోళ్లకు షాపులకు వస్తున్నారని వ్యాపారులు తెలిపారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో జూన్ లో ప్రభుత్వాలు లాక్ డౌన్లు అమలు చేశాయి. అయితే కరోనా ఆంక్షలు, జాగ్రత్తల నడుమ వ్యాపారాలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు.