అవిభక్త కవలల స్కూటర్ రైడింగ్ అదుర్స్..! వీడియో వైరల్

వారు అవిభక్త కవలలు అంటే మనకు ఠక్కున గుర్తుకొచ్చేవారు వీణా..వాణిలు. అటువంటి మరో అవిభక్త కవలలు చేసే పనులు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇద్దరి శరీరాలు కలిసే పుట్టటంతో వారు ఏపనిచేసిన కలిసే చేయాలి. కలిసే పుట్టిన ఆ కవలలు ఏదో సాధారణమైన జీవితానికి పరిమితంకాలేదు. ఏకంగా స్కూటర్ నడిపేస్తున్నారు.
ఆ అవిభక్త కవలలు చేసే స్కూటర్ రైడ్ అదుర్స్! అంటున్నారు నెటిజన్లు. స్ఫూర్తినిచ్చే ఈ సందర్భం ఛత్తీస్‌గడ్ లోని రాయ్‌పూర్ కు 100 కిలోమీటర్ల దూరంలో ఉండే పెట్రోల్ బంక్ లో జరిగిన సందర్భాన్ని తీసిన వీడియోని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అది వైరల్ గా మారింది.
శరీరాలు కలిసి పుట్టిన ఈ అవిభక్త కవలలు తమ వైకల్యాన్ని లెక్క చేయకుండా సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. వైకల్యం తమ ఆశలకు..ఆకాంక్షలకు అడ్డుకాదనీ..అలా పుట్టినంత మాత్రాన తమ ఇష్టాలు చంపేసుకోవాల్సిన పనిలేదని నిరూపిస్తున్నారు ఈ అవిభక్త కవలలు.
అలా స్కూటర్ నడుపుతూ.. పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లిన ఈ అవిభక్త కవలలను చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఇద్దరిలో ఒకరు ఎస్కలేటర్ పట్టుకుని దారి చూస్తుంటే, మరొకరు ఫ్రంట్ బ్రేక్, హ్యాండిల్ పట్టుకుని స్కూటర్ నడపడం చూస్తే మీరూ ఆశ్చర్యపోతారు.