International Flights : మరికొద్ది రోజుల్లోనే..సాధారణ స్థితికి అంతర్జాతీయ విమాన సేవలు!

ఈ ఏడాది చివరికల్లా అంతర్జాతీయ విమాన కార్యకలాపాలు తిరిగి సాధారణ(కోవిడ్ పూర్వ స్థితికి)స్థితికి చేరుకుంటాయని పౌర విమానయాన శాఖ

International Flights : మరికొద్ది రోజుల్లోనే..సాధారణ స్థితికి అంతర్జాతీయ విమాన సేవలు!

Flights

Updated On : November 24, 2021 / 4:17 PM IST

International Flights ఈ ఏడాది చివరికల్లా అంతర్జాతీయ విమాన కార్యకలాపాలు తిరిగి సాధారణ(కోవిడ్ పూర్వ స్థితికి)స్థితికి చేరుకుంటాయని పౌర విమానయాన శాఖ కార్యదర్శి రాజివ్ భన్సాల్ బుధవారం తెలిపారు. ఇక,గత వారం పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా కూడా..అంతర్జాతీయ విమాన సేవలను తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చే ప్రక్రియపై కేంద్రప్రభుత్వం పనిచేస్తున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే.

పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి ప్రభుత్వం ఆసక్తిగా ఉన్నప్పటికీ, కరోనా ఇన్‌ఫెక్షన్లు మళ్లీ పెరుగుతున్న క్రమంలో ప్రత్యేకించి అనేక ప్రధాన యూరోపియన్ దేశాలు రోజువారీ కొత్త కేసులలో భయానక పెరుగుదలను నమోదు చేస్తున్నందున తగిన రక్షణ చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు.

మరోవైపు,కోవిడ్ కారణంగా గతేడాది మార్చి నుంచి ఆంక్షలను ఎదుర్కొన్న దేశీయ విమాన సేవలు..గత నెల నుంచి పూర్తిస్థాయిలో అనుమతించబడిన విషయం తెలిసిందే.

ఇక,పలు దేశాలతో కుదుర్చుకున్న ఎయిర్ బబుల్ బప్పందంలో భాగంగా కొన్ని నిర్దేశించిన దేశాలకు మాత్రమే భారత్ నుంచి పరిమిత సంఖ్యలో అంతర్జాతీయ విమాన సర్వీసులు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ALSO READ KTR Condemns : 32 మంది బీజేపీ కార్పొరేటర్లపై కేసు…దాడిని ఖండించిన మంత్రి కేటీఆర్