KTR Condemns : 32 మంది బీజేపీ కార్పొరేటర్లపై కేసు…దాడిని ఖండించిన మంత్రి కేటీఆర్

గాడ్సే భక్తులు గాంధీ మార్గాన్ని అనుసరిస్తారని ఎలా అనుకుంటారు..ఈ ఘటనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని హైదరావాద్ సీపీకి ఆయన విజ్ఞప్తి చేశారు.

10TV Telugu News

BJP Corporator GHMC : జీహెచ్ఎంసీ కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్లు చేసిన వీరంగం, దాడిని మంత్రి కేటీఆర్ ఖండించారు. ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్లు రౌడీలు, గూండాల్లా వ్యవహరించారని, కార్పొరేటర్ల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. గాడ్సే భక్తులు గాంధీ మార్గాన్ని అనుసరిస్తారని ఎలా అనుకుంటారు..ఈ ఘటనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని హైదరావాద్ సీపీకి ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. దీనిపై పోలీసులు స్పందించారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో దాడి ఘటనపై కేసు నమోదు చేశారు. 32 మంది బీజేపీ కార్పొరేటర్లపై కేసు నమోదు చేశారు పోలీసులు.

Read More : heart attacked by Chickens : డీజే సౌండ్‌కు కోడికి గుండెపోటు…63 కోళ్లు కన్నుమూత

మరోవైపు…బీజేపీ కార్పొరేటర్ల దాడిని టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఖండించారు. జీహెచ్ఎంసీ కార్యాలయానికి వెళ్లిన వీరు..అక్కడ పాలతో శుభ్రం చేశారు. బీజేపీ ధర్నా..జీహెచ్ఎంసీ చరిత్రలో ఒక చీకటిరోజుగా అభివర్ణించారు. దాడికి పాల్పడిన కార్పొరేటర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ..మేయర్ కు వినతిపత్రం సమర్పించారు. బీజేపీ కార్పొరేటర్లపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్లు పద్ధతిని మార్చుకోవాలంటూ హితవు పలికారు.

Read More : Chittoor Floods : బాబుకు మతిస్థిమితం లేదు..అధికార ధ్యాసే

2021, నవంబర్ 23వ తేదీ మంగళవారం జీహెచ్ఎంసీ కార్యాలయానికి బీజేపీ కార్పొరేటర్లు చేరుకున్నారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తూ..ధర్నాకు దిగారు. ఎన్నికల కోడ్ ఉందని..దీని ప్రకారం సమావేశం నిర్వహించలేమని అధికారులు సమాధానం ఇచ్చినట్లు సమాచారం. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ…మేయర్ ఛాంబర్ లోకి కార్పొరేటర్లు చొచ్చుకెళ్లారు. అక్కడున్న పూలకుండీలను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.

×