Kedarnath Yatra 2025
Kedarnath Yatra 2025 : కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కేదార్‌నాథ్ యాత్ర 2025 కోసం స్పెషల్ హెలికాప్టర్ సర్వీసులను ప్రకటించింది.
వచ్చే మే 2 నుంచి ప్రారంభమై మే 31 వరకు ప్రతిరోజూ హెలికాప్టర్ సర్వీసులను అందించనుంది. ఈ సర్వీసులను కేదార్‌నాథ్ యాత్రికులకు వేగంగా కేదార్‌నాథ్ ఆలయానికి చేర్చేందుకు ఐఆర్‌సీటీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది.
సురక్షితమైన సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా ఐఆర్‌సీటీసీ హెలికాప్టర్ సర్వీసులను అందిస్తోంది. మూడు ప్రదేశాల నుంచి హెలికాప్టర్ షటిల్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
ఫాటా : రూ. 6,063 (రౌండ్ ట్రిప్)
సిర్సి : రూ. 6,061 (రౌండ్ ట్రిప్)
గుప్త్ కాశి : రూ. 8,533 (రౌండ్ ట్రిప్)
ఈ వాయుమార్గాల్లో హిమాలయాల మీదుగా మీరు ప్రయాణం చేయొచ్చు. ప్రయాణ సమయం తగ్గడమే కాదు.. రైల్వే మార్గంలో వెళ్లే విధంగా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.
యాత్రకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి, బుకింగ్ ప్రక్రియ ఇలా :
క్యాన్సిల్, రీఫండ్ ప్రాసెస్ ఇలా :
ఒకవేళ మీ ప్లానింగ్ మారితే.. ప్రయాణికులు తమ బుకింగ్‌ను క్యాన్సిల్ చేసుకోవచ్చు. క్యాన్సిలేషన్ ఛార్జీలు వర్తిస్తాయి. ఆ తర్వాత 5 నుంచి 7 వర్కింగ్ డేస్‌లో మీ డబ్బు రీఫండ్ అవుతుంది. అయితే, షెడ్యూల్ అయి బయలుదేరే 24 గంటలలోపు టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే ఎలాంటి రీఫండ్ ఉండదని గమనించాలి.
Read Also : Best Cooling AC : కొత్త ఏసీ కావాలా? రూ. 35వేల లోపు ధరలో టాప్ కూలింగ్ ఏసీలు ఇవే.. మీ ఇల్లంతా కూల్.. కూల్..!
ఈ సర్వీసులకు హై డిమాండ్ ఉన్నందున, యాత్రికులు తమకు ఇష్టమైన ప్రయాణ తేదీలు, సమయాలను ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. తక్కువ సమయంలోనే అత్యంత సౌకర్యవంతమైన కేదార్‌నాథ్ యాత్రను పూర్తి చేయొచ్చు.