IRCTC Tour Packages : సమ్మర్‌లో టూర్ ప్లాన్ చేస్తున్నారా? IRCTC స్పెషల్ ట్రైన్ల ప్యాకేజీలు ఇవే.. 10 రోజుల వరకు ఎంజాయ్ చేయొచ్చు..!

IRCTC Tour Packages : సమ్మర్ టూర్ వెళ్లేందుకు చూస్తున్నారా? అయితే, మీకోసం IRCTC అద్భుతమైన టూర్ ప్యాకేజీలను ఆఫర్ చేస్తోంది. స్పెషల్ ట్రైన్లలో మొత్తం 10 రోజుల వరకు నచ్చిన ప్రాంతాలను సందర్శించవచ్చు.

IRCTC Tour Packages

IRCTC Tour Packages : సమ్మర్‌‌లో ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఈ సమ్మర్ హాలిడేస్‌లో ట్రిప్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.. భారతీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ‘భారత్ గౌరవ్’ పేరుతో స్పెషల్ ట్రైన్లను ఏర్పాటు చేసింది. మొత్తం నాలుగు ప్రత్యేక ప్యాకేజీలను ఆఫర్ చేస్తోంది. ఈ నెల 23 నుంచి జూన్ 11 వరకు 4 విడతల్లో ఈ టూర్ ప్యాకేజీలను అందిస్తోంది.

ప్రతి టూర్ 8 రోజుల నుంచి 10 రోజుల పాటు కొనసాగుతుంది. అయితే, రైల్వే టూర్ ప్యాకేజీ ధరలను ఎకానమీ, స్టాండర్డ్, కంఫర్ట్ కేటగిరీలుగా విభజించింది. ప్రారంభ ధర రూ. 18 వేల నుంచి రూ. 40 వేల వరకు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. హరిద్వార్, అయోధ్య, రిషికేశ్, కాశీ, అరుణాచలం, పూరీ ఉజ్జయిని వంటి దక్షిణ, ఉత్తర భారత్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, టూరిజం డెస్టినేషన్లను కవర్ చేస్తూ ప్యాకేజీలను అందిస్తోంది.

Read Also : Samsung Galaxy Z Fold 6 : బంపర్ ఆఫర్ భయ్యా.. అమెజాన్‌లో ఈ శాంసంగ్ మడతబెట్టే ఫోన్‌పై ఏకంగా రూ.35వేలు డిస్కౌంట్.. డోంట్ మిస్..!

ప్రతి ట్రైన్‌ కోచ్‌లో 70 మందితో అన్ని కోచ్‌లలో మొత్తం 700 మంది టూరిస్టులను తీసుకెళ్లతారు. ఉదయం పూట టీ, బ్రేక్‌ఫాస్ట్ నుంచి మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ వరకు ప్యాకేజీలను అందిస్తుంది. ఏసీ, నాన్ ఏసీ లాడ్జింగ్ సౌకర్యం కూడా ఉంటుంది. ట్రావెలింగ్, లాడ్జింగ్, బోర్డింగ్ చార్జీలు కూడా ప్యాకేజీలోనే ఉంటాయి.

టూరిస్టుల సేఫ్టీ కోసం కోచ్‌లో సీసీ కెమెరాలు, సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ మెడికల్ ఫెసిలిటీ కూడా ఉంటుందని ఐఆర్సీటీసీ అధికారులు పేర్కొన్నారు. టూర్ ప్యాకేజీలకు సంబంధించి పూర్తి వివరాల కోసం 04027702407, 97013, 60701, 92810 30711, 92810 30712, 92810 30749, 9281030750 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

ప్యాకేజీ 1 (గురుకృప యాత్ర) :
ఈ ప్యాకేజీలో ఈ నెల 23 నుంచి మే 2 వరకు (9 నైట్స్, 10 డేస్) యాత్ర కొనసాగనుంది. ఈ స్పెషల్ ట్రైన్ విజయవాడలో బయల్దేరి నల్గొండ, సికింద్రాబాద్, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్ నగర్ మీదుగా వెళ్లనుంది. స్లీపర్ కోచ్ (ఎకానమీ)లో పిల్లలకు రూ.17,390, పెద్దలకు రూ.18,510, థర్డ్ ఏసీ (స్టాండర్డ్)లో పిల్లలకు రూ.29,420, పెద్దలకు రూ.30,730, సెకండ్ ఏసీ కంఫర్ట్‌లో పిల్లలకు రూ.39,110, పెద్దలకు రూ.40,685గా రేటు నిర్ణయించారు.

హరిద్వార్ (మానసాదేవి టెంపుల్, గంగా హారతి), రిషికేశ్ (రామ ఝులా, లక్ష్మ ణ్ఝులా), వైష్ణోదేవి టెంపుల్, అమృత్సర్ గోల్డెన్ టెంపుల్, వాఘా బార్డర్, ఆనందపూర్ సాహిబ్ గురుద్వారా, నైనాదేవి టెంపుల్ ప్రాంతాలను సందర్శించవచ్చు.

ప్యాకేజీ 2 (సరస్వతీ పుష్కరాల స్పెషల్) :
ఈ ప్యాకేజీలో సరస్వతీ పుష్కరాల స్పెషల్ యాత్ర మే 8 నుంచి 17 వరకు (9 నైట్స్, 10 డేస్) ఈ యాత్ర సాగనుంది. ఈ ట్రైన్ సికింద్రాబాద్ బయల్దేరి భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర మీదుగా వెళ్లనుంది. స్లీపర్ కోచ్‌లో పిల్లలకు రూ.15,700, పెద్దలకు రూ.16,800, థర్డ్ ఏసీలో పిల్లలకు రూ.25,300, పెద్దలకు రూ.26,600, సెకండ్ ఏసీలో పిల్లలకు రూ.33,300, పెద్దలకు రూ.34,900గా నిర్ణయించారు.

పూరీ జగన్నాథ్ టెంపుల్, కోణార్క్ ఆలయం, గయ విష్ణుపాధ్ టెంపుల్, కాశీలో కాశీ విశ్వనాథ్, విశాలాక్షి, అన్నపూర్ణాదేవి ఆలయాలు, గంగాహారతి, అయోధ్య రామాలయం, ప్రయా గ్రాజ్ త్రివేణి సంగమం వంటి ప్రాంతాలను దర్శించుకోవచ్చు.

ప్యాకేజీ 3 (దివ్య దక్షిణీయాత్ర) :
ఈ యాత్ర మే 22 నుంచి 30 వరకు (8 నైట్స్, 9 డేస్) కొనసాగనుంది. సికింద్రాబాద్‌లో బయల్దేరే ఈ ట్రైన్ భువనగిరి, కాజీపేట, జనగాం, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర మీదుగా వెళ్లనుంది. స్లీపర్ కోచ్ పిల్లలకు రూ.13,700, పెద్దలకు రూ.14,700, థర్డ్ ఏసీలో పిల్లలకు రూ.21,700, పెద్దలకు రూ.22,900, సెకండ్ ఏసీలో పిల్లలకు రూ.28,400, పెద్దలకు రూ.29,900గా ధర నిర్ణయించారు.

తిరువణ్ణమలైలో అరుణాచలం టెంపుల్, రామేశ్వరం రామనాథస్వామి ఆలయం, మధురై మీనాక్షి టెంపుల్, కన్యాకుమారిలో రాక్ మెమోరియల్, కుమారి అమ్మన్ టెంపుల్, త్రివేండ్రంలో శ్రీపద్మనాభస్వామి ఆలయం, ట్రిచీలో శ్రీరంగనాథస్వామి ఆలయం, తంజావూరు బృహదీశ్వరాలయం వరకు యాత్ర కొనసాగనుంది.

Read Also : iPhones Price : లిమిటెడ్ ఆఫర్ బ్రో.. ఈ రెండు ఐఫోన్లపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు.. కొంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్..!

ప్యాకేజీ 4 (జ్యోతిర్లింగ దర్శన్) :
ఈ యాత్ర జూన్ 3 నుంచి 11 వరకు (8 నైట్స్, 9డేస్) యాత్ర కొనసాగుతుంది. ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి బయల్దేరి కామారెడ్డి, నిజామాబాద్ మీదుగా వెళ్తుంది. పెద్దలకు స్లీపర్ కోచ్ రూ.14,700, పిల్లలకు రూ.13,700, థర్డ్ ఏసీలో పిల్లలకు రూ.21,700, పెద్దలకు రూ.22,900, సెకండ్ ఏసీలో పిల్లలకు రూ.28,400, పెద్దలకు రూ.29,900గా నిర్ణయించారు.

ఈ ట్రైన్ ఉజ్జయినిలో మహాకాళేశ్వర్, ఓం కారేశ్వర్, నాగ్పూర్‌లో శ్రీస్వామినారాయణ్ మందిర్, దీక్షభూమి స్తూపం, నాసిక్‌లో త్రయం బకేశ్వర్, పూణేలో భీమశంకర్ జ్యోతిర్లింగం, ఔరంగాబాద్‌లో ఘృష్టేశ్వర టెంపుల్, మోవ్‌లో అంబేద్కర్ పుట్టిన ప్రాంతం వరకు యాత్ర కొనసాగనుంది.