పలుకే బంగారమాయే : ఐదేళ్లలో పార్లమెంట్‌లో మౌనంగానే అద్వానీ

బీజేపీ పార్టీలో కురువృద్ధుడు, సీనియర్ నాయకుడు, బీజేపీ ఐరన్ మ్యాన్ అంటే టక్కున గుర్తుచ్చే వ్యక్తి. ఎల్ కే అద్వానీ (లాల్ కృష్ణ అద్వానీ). పార్లమెంటులో స్ట్రాంగ్ స్పీకర్ ఎవరైనా ఉన్నారంటే వారిలో అద్వానీ ముందు వరుసలో ఉంటారు.

  • Published By: sreehari ,Published On : February 8, 2019 / 08:32 AM IST
పలుకే బంగారమాయే : ఐదేళ్లలో పార్లమెంట్‌లో మౌనంగానే అద్వానీ

Updated On : February 8, 2019 / 8:32 AM IST

బీజేపీ పార్టీలో కురువృద్ధుడు, సీనియర్ నాయకుడు, బీజేపీ ఐరన్ మ్యాన్ అంటే టక్కున గుర్తుచ్చే వ్యక్తి. ఎల్ కే అద్వానీ (లాల్ కృష్ణ అద్వానీ). పార్లమెంటులో స్ట్రాంగ్ స్పీకర్ ఎవరైనా ఉన్నారంటే వారిలో అద్వానీ ముందు వరుసలో ఉంటారు.

బీజేపీ పార్టీలో కురువృద్ధుడు, సీనియర్ నాయకుడు, బీజేపీ ఐరన్ మ్యాన్ అంటే టక్కున గుర్తుచ్చే వ్యక్తి.. LK అద్వానీ (లాల్ కృష్ణ అద్వానీ). పార్లమెంటులో స్ట్రాంగ్ స్పీకర్ ఎవరైనా ఉన్నారంటే వారిలో అద్వానీ ముందు వరుసలో ఉంటారు. ఎందుకంటే ఈయన లోక్ సభలో ముందు సీటులోనే కనిపిస్తుంటారు. ఐదేళ్ల కాలంలో పార్లమెంటులో అన్ని సెషన్లకు 365 రోజులు పాటు అద్వానీ హాజరయ్యారు. ఇంతకీ పెద్దాయన హాజరు శాతం ఎంతో తెలుసా? 92 శాతం.

ఈ ఐదేళ్ల కాలంలో ఎప్పుడు మౌనంగా కనిపించే అద్వానీ మాట్లాడింది కేవలం 365 పదాలేనట. రానురాను అద్వానీ ప్రసంగం తగ్గిపోతూ వస్తోంది. 16వ లోక్ సభ (2014-19)లో అద్వానీ ప్రసంగానికి 15వ లోక్ సభ (2019-14) ప్రసంగానితో పోలిస్తే ఆయన మాట్లాడిన పదాలు 99 శాతానికి తగ్గాయి. ఐదేళ్ల కాలంలో పార్లమెంటులో అద్వానీ  365 పదాలతోనే సరిపెట్టేశారు. 2012, ఆగస్టు 8న పార్లమెంటులో అస్సాం రాష్ట్రంలో హింసాత్మక ఘటనలకు సంబంధించి వాయిదా తీర్మానంపై చర్చ కొనసాగింది. 

 

ఈ చర్చకు బీజేపీ ఐరన్ మ్యాన్ ఎల్ కే అద్వానీ నేతృత్వంలో జరిగింది. దశాబ్దాలుగా రాజకీయాల్లో నిరంతరాయంగా కొనసాగుతున్న అద్వానీ.. తన పొలిటికల్ కెరీర్ లో మాట్లాడిన ప్రసంగాల్లో ఒక రోజు ప్రసంగంలో దాదాపు 5వేల పదాలు (4వేల, 957పదాలకు పైనే) మాట్లాడారు. 2019 జనవరి 8న లోక్ సభలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పౌరసత్వ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది.

దీనిపై భారీ ఎత్తున డిబెట్ జరిగింది. ఆ సమయంలో సభలో అద్వానీ కూడా ఉన్నారు. అయినప్పటికీ అద్వానీ ఒక మాట మాట్లాడకపోవడం గమనార్హం.  15వ లోక్ సభలో అద్వానీ మొత్తం 42 డెబెట్ ల్లో పాల్గొన్నారు. ఈ చర్చల్లో అద్వానీ తన ప్రసంగంలో 35వేల 926 పదాలు మాట్లాడారు. అద్వానీ బయోగ్రఫీ కు సంబంధించిన 1 వెయ్యి పేజీలతో మై కంట్రీ, మై లైఫ్ పుస్తకాలను ప్రచురితం చేశారు.  2008 నుంచి 2018 ఎనిమిదేళ్ల కాలంలో రాజకీయాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రభుత్వం మారింది. ఐరన్ మ్యాన్ అద్వానీలో కూడా చాలా మార్పు వచ్చింది.  

Read Also: నవ్వులపాలు : లోకేష్ సభలో జగన్ బొమ్మలతో కుర్చీలు