Hamas : గాజా ఆసుపత్రిలో హమాస్ ఉగ్రవాదుల పాగా…వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్

గాజా నగరంలోని అల్ షిఫా ప్రభుత్వ ఆసుపత్రి హమాస్ ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా ఉందని ఇజ్రాయెల్ ఆరోపించింది. గాజా ఆసుపత్రి రోగుల చికిత్స కోసమే కాకుండా హమాస్ తీవ్రవాదులకు అడ్డాగా మారిందని ఇజ్రాయెల్ పేర్కొంది....

Gaza Hospital

Hamas : గాజా నగరంలోని అల్ షిఫా ప్రభుత్వ ఆసుపత్రి హమాస్ ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా ఉందని ఇజ్రాయెల్ ఆరోపించింది. గాజా ఆసుపత్రి రోగుల చికిత్స కోసమే కాకుండా హమాస్ తీవ్రవాదులకు అడ్డాగా మారిందని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇజ్రాయెల్ తాజాగా గాజా ఆసుపత్రిలో ఇద్దరుర హమాస్ ఉగ్రవాదులను ఇంటరాగేషన్ చేస్తున్న వీడియోలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ విడుదల చేసింది.

Also Read : Goa Athletes : గోవాలో తక్కువ ధరకే లభిస్తుందని మద్యం తాగొద్దు…అథ్లెట్లకు మంత్రి సలహా

గాజాలోని ఆసుపత్రులను హమాస్ దాడుల ఆపరేషన్ కేంద్రాలుగా ఉపయోగించుకుందని ఇజ్రాయెల్ సైన్యం ఆరోపించింది. కాగా దాన్ని హమాస్ ఖండించింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రతినిధి ఎక్స్ లో రెండు వీడియోలను పోస్ట్ చేసింది. హమాస్ గాజాలోని షిఫా హాస్పిటల్‌ను ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించినట్లు తమ వద్ద మరిన్ని ఆధారాలు ఉన్నాయని ఇజ్రాయెల్ తెలిపింది.

Also Read : Hero Bus Driver : గుండెపోటు వచ్చినా 48 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన బస్సు డ్రైవర్

ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకోకుండా ఉండటానికి హమాస్ ఉగ్రవాదులు క్లినిక్‌లు, పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర ప్రదేశాలలో దాక్కున్నట్లు సమాచారం. తీవ్రవాద కార్యకలాపాల కోసం షిఫా ఆసుపత్రిని హమాస్ ఉపయోగించినట్లు ఆధారాలు లభించాయి. ఇద్దరు ఉగ్రవాదుల ఇంటరాగేషన్ వీడియోలను పోస్టు చేశారు. రాత్రిపూట జరిగిన భీకర బాంబు దాడి వందలాది భవనాలను ధ్వంసం చేసింది.

Also Read :   Mukesh Ambani : రిలయన్స్ ముకేశ్ అంబానీకి మరో బెదిరింపు…ఈ సారి రూ.200 కోట్లు ఇవ్వాలని…

గాజాలోని హమాస్-నియంత్రిత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇజ్రాయెల్ దాడుల్లో 7,703 మంది మరణించారు. మృతుల్లో పౌరులు, వారిలో 3,500 మందికి పైగా పిల్లలు ఉన్నారు. షిఫా ఆసుపత్రి భూగర్భంలో ఉగ్రవాదులు దాక్కున్నారని తేలింది. తాము ఇజ్రాయెల్ దళాలకు చిక్కకుండా ఆసుపత్రులు, పాఠశాలల్లో దాక్కున్నామని ఐడీఎఫ్ తెలిపింది.