ట్యాక్స్ పేయర్లకు గుడ్ న్యూస్…పెండింగ్ Income Tax రీఫండ్స్ విడుదల

  • Published By: venkaiahnaidu ,Published On : April 8, 2020 / 01:23 PM IST
ట్యాక్స్ పేయర్లకు గుడ్ న్యూస్…పెండింగ్  Income Tax రీఫండ్స్ విడుదల

Updated On : April 8, 2020 / 1:23 PM IST

5లక్షల వరకు పెండింగ్ లో ఉన్న మొత్తం పెండిగ్ ఇన్ కమ్ ట్యాక్స్ రీఫండ్స్ ను వెంటనే రిలీజ్ చేయాలని ఐటీ శాఖ నిర్ణయించింది. దాదాపు 14లక్షల మంది ట్యాక్స్ పేయర్లు దీనిద్వారా లబ్ధి పొందనున్నారు. అంతేకాకుండా,MSMEలతో కలిపి దాదాపు 1లక్ష వ్యాపార ఎంటిటీస్ కు లబ్ధి చేకూర్చేందుకు అన్ని జీఎస్టీ మరియు కస్టమ్ రీఫండ్స్ కూడా విడుదల కానున్నాయి.

మొత్తం రీఫండ్ అమౌంట్ 18వేల కోట్లుగా ఉందని కేంద్రఆర్థికమంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో ట్యాక్స్ పేయర్లకు ఊరట కలిగించేందుకు ఐటీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.