IT Industry : ఉద్యోగాల్లేవు.. సంక్షోభంలో ఐటీ రంగం, భారీగా తగ్గిన క్యాంపస్ రిక్రూట్‌మెంట్, కారణం ఏంటంటే
ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీలు కూడా ఇదే వైఖరితో ఉన్నాయి. ఈ ఏడాది క్యాంపస్ నియామకాలు చేపట్టడం లేదని ఇప్పటికే విప్రో ప్రకటించింది. IT Industry Crisis

IT Industry Crisis
IT Industry Crisis : ఐటీ రంగం సంక్షోభాన్ని ఎదుర్కోంటోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) ప్రభావం ఐటీ రంగంపై తీవ్రంగా కనిపిస్తోంది. దీంతో క్యాంపస్ రిక్రూట్ మెంట్లు భారీగా తగ్గిపోయాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ల సంఖ్య గతంలో ఎన్నడూ లేనంత తక్కువగా ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇదే పరిస్థితి కొనసాగనుంది. తదుపరి ఆర్థిక సంవత్సరం ప్రాతిపదికన ఉద్యోగులను నియమించుకునే ఐటీ కంపెనీలు ఇప్పుడు క్యాంపస్ ల జోలికి వెళ్లడం లేదు. జనవరి-మార్చి క్వార్టర్ ముగిసిన తర్వాతే ఆయా కంపెనీలు క్యాంపస్ రిక్రూట్ మెంట్ చేపట్టే అవకాశం ఉంది.
ఇన్ఫోసిస్, విప్రో కీలక ప్రకటన..
2023, 24 బ్యాచ్ విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. వార పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీలు కూడా ఇదే వైఖరితో ఉన్నాయి. ఈ ఏడాది క్యాంపస్ నియామకాలు చేపట్టడం లేదని ఇప్పటికే విప్రో ప్రకటించింది. 2023వ సంవత్సరం కోసం భారీగా నియామకాలు చేపట్టామని, దీంతో క్యాంపస్ రిక్రూట్ మెంట్ ను పక్కన పెట్టామని ఇన్ఫోసిస్ తెలిపింది.
Also Read : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐవోసీఎల్)లో అప్రెంటిస్ ఖాళీల భర్తీ
ఐటీ ఉద్యోగాల్లో కోత..
కొన్ని ఐటీ కంపెనీలకు క్యాంపస్ రిక్రూట్ మెంట్ చేపట్టే ఆలోచన ఉన్నప్పటికీ ఎప్పుడన్నది కచ్చితంగా చెప్పడం లేదు. 2024లో కాలేజీ విద్య పూర్తి చేసుకునే విద్యార్థులతో పోలిస్తే 2025లో చదువు పూర్తి చేసుకునే వారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా ఐటీ రంగంలో సంక్షోభం నెలకొని ఉంది. 2022లో ఉద్యోగాల్లో ఐటీ కంపెనీలు కోత విధించాయి.
ఐటీ సెక్టార్ పై ఏఐ తీవ్ర ప్రభావం..
అయితే గత ఏడాదితో పోలిస్తే ఉద్యోగాల కోత ఈ ఏడాది ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఐటీ రంగంపై తీవ్రంగా ఉంది. విప్రో సొల్యూషన్స్ అన్నీ 6 నెలల్లో ఏఐ ఆధారంగా పని చేస్తాయని సీఈవో తెలిపారు. కరోనా ముందు కాలంతో పోలిస్తే ఐటీ ఉద్యోగాల నియామకాలు 30 నుంచి 40శాతం తగ్గాయి. క్యాంపస్ ప్లేస్ మెంట్ సీజన్ గతంతో పోలిస్తే 15 నుంచి 20 రోజులు ఆలస్యం అవుతోంది.
Also Read : సిటీ యూనియన్ బ్యాంక్ లో పోస్టుల భర్తీ