Puri : జగన్నాథుడి రథయాత్ర, భక్తులకు నో ఎంట్రీ

ఒడిశాలోని పూరీలో జగన్నాథుడి రథయాత్రకు సిర్వం సిద్ధం చేశారు. రథయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే జగన్నాథుడు, బలభద్రుడు, దేవీ సుభద్ర రథాలు సుందరంగా ముస్తాబయ్యాయి.

Jagannath Rath Yatra : ఒడిశాలోని పూరీలో జగన్నాథుడి రథయాత్రకు సిర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే జగన్నాథుడు, బలభద్రుడు, దేవీ సుభద్ర రథాలు సుందరంగా ముస్తాబయ్యాయి. 2021, జూలై 12వ తేదీ సోమవారం స్వామివారు రథంపై ఊరేగనున్నారు. స్వామివారి ర‌థ‌యాత్రకు ఎలాంటి అడ్డంకులు ఎదురుకాకుండా ఒడిశా పోలీసులు ప‌టిష్టమైన బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

కోవిడ్ వ్యాప్తి కారణంగా భ‌క్తులంతా ప్రభుత్వ నిర్ణయానికి క‌ట్టుబ‌డి ఉండాల‌ని, ఏ ఒక్కరూ కూడా ర‌థ‌యాత్రను ప్రత్యక్షంగా వీక్షించేందుకు రావ‌ద్దని ఆల‌య ప్రధాన సేవ‌కులు కోరారు.  ఉదయం 11 నుంచి 12 వరకు పూరీ రాజు గజపతి దివ్య సింగ్ దేవ్ చెరాపహరా ఉండనున్నారు. మధ్యాహ్నం 1:30కి రథాలకు అశ్వాలను జత చేయనున్నారు. మధ్యాహ్నం 2 తరువాత గుండిచా మందిరం వైపు మూడు రథాలు తిరగనున్నాయి. గుండిచా మందిరానికి చేరుకున్న తరువాత రథాలపై ఇతర సేవలు కొనసాగించనున్నారు.

Read More : Toilet Pay Money : ఇక్కడి టాయిలెట్స్ వాడితే ఎదురు డబ్బులిస్తారు..!

ప్రజలంతా ఎవ‌రి ఇళ్లలో వాళ్లు ఉండి టీవీల్లో ప్రత్యేక్ష ప్రసారం ద్వారా ర‌థ‌యాత్రను వీక్షించాల‌ని సూచించారు. కరోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఈసారి ర‌థ‌యాత్రకు భ‌క్తుల‌ను అనుమ‌తించ‌డంలేదు ప్రభుత్వం. కేవ‌లం అర్చకులు, ఆల‌య సిబ్బంది మాత్రమ ర‌థ‌యాత్రలో పాల్గొనున్నారు. వీరితోపాటు ఎంపిక చేసిన కొద్ది మంది భక్తులను రథం లాగేందుకు అనుమతి ఇచ్చారు. వారికి ముందుగానే కోవిడ్ టెస్టుతో పాటు కరోనా వ్యాక్సిన్‌ కూడా వేశారు. గతేడాది సుప్రీంకోర్టు జారీ చేసిన అన్ని మార్గదర్శకాలను ఈసారి కూడా పాటించనున్నట్లు అధికారులు తెలిపారు. రెండు డోసుల టీకా వేసుకున్న ఐదు వందల మంది సేవలకు మాత్రమే రథాన్ని లాగేలా చర్యలు తీసుకున్నారు.

Read More : David warner : ఏ సినిమా చూడాలి – డేవిడ్ వార్నర్

ట్రెండింగ్ వార్తలు