Bullet Train in India: భారత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మార్పులతో రానున్న జపాన్ బుల్లెట్ ట్రైన్

ఉష్ణోగ్రతలు, దుమ్ము, ట్రైన్ బరువు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని బుల్లెట్ ట్రైన్ లో మార్పులు చేయనున్నట్లు సతీష్ అగ్నిహోత్రి వివరించారు.

Bullet

Bullet Train in India: భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ “బుల్లెట్ ట్రైన్” కల త్వరలో సాకారం కానుంది. జపాన్ లో ప్రస్తుతం వాడుకలో ఉన్న E5 షింకాసెన్ సాంకేతిక సహాయంతో భారత ప్రభుత్వం ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును చేపడుతుంది. 2027 ముందు నాటికే మొదటి దశను అందుబాటులోకి తెచ్చే విధంగా కొనసాగుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనులపై నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ అగ్నిహోత్రి స్పందిస్తూ..జపాన్ సహకారంతో అభివృద్ధి చేస్తున్న బుల్లెట్ ట్రైన్..భారత్ కు చేరుకునే ముందు ఇక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా మార్పులు చేయనున్నట్టు తెలిపారు. ఉష్ణోగ్రతలు, దుమ్ము, ట్రైన్ బరువు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని బుల్లెట్ ట్రైన్ లో మార్పులు చేయనున్నట్లు సతీష్ అగ్నిహోత్రి వివరించారు. 2027 నాటికీ సూరత్-బిల్లిమోరా మధ్య 48 కిలోమీటర్ల ట్రాక్ పనులు పూర్తి కానున్నాయని, అందుకే ఒక ఏడాది ముందే ఈ ప్రాజెక్టు మొదటి ట్రయల్స్ జరుగుతాయని సతీష్ అగ్నిహోత్రి తెలిపారు. అయితే, భూసేకరణ సమస్యల కారణంగా ఈ ప్రాజెక్టు మహారాష్ట్రలో నిలిచిపోయిందని ఆయన అన్నారు.

Also read:Bihar CM Nitish Kumar : బీహార్ సీఎం సభలో బాంబు దాడి

ప్రస్తుతం జపాన్లో నడుస్తున్న ఈ5 షింకాసెన్ సిరీస్ రైళ్లను భారత్ లోనూ అందుబాటులోకి తీసుకురానుండగా దుమ్ము, ధూళి, ఉష్ణోగ్రత పరంగా వాటిని భారతీయ పరిస్థితులకనుగుణంగా మార్పులు చేయడానికి అధ్యయనాలు చేస్తున్నారు. జపాన్ లోని షింకన్సెన్ హై-స్పీడ్ రైలులో E5 శ్రేణి రైళ్లను హిటాచీ మరియు కవాసకి హెవీ ఇండస్ట్రీస్ సంయుక్తంగా నిర్మించాయి. ఇవి గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. 3.35 మీటర్ల వెడల్పుతో ఉండే ఈ రైళ్లు, ఫ్రాన్స్ మరియు జర్మనీ వంటి దేశాలలో అందుబాటులో ఉండే అత్యంత విశాలమైన రైళ్లతో పోటీపడుతున్నాయి. భారతీయ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసే ఆరు రైళ్లను ముందుగా పంపనున్న జపాన్, మరికొన్నిటిని దేశంలో అసెంబుల్ చేయడానికి నాక్ డౌన్ కండిషన్ లో ఉన్న కోచ్ లగా పంపించనుంది. పూర్తి మార్పుల అనంతరం వాస్తవ ఆర్డర్లు జారీ చేస్తామని అధికారులు తెలిపారు.

Also read”supreme court : అటువంటి అమ్మ నాకొద్దు..నేను మాట్లాడను అంటూ..తల్లి పెట్టిన చిత్రహింసల్ని కోర్టు చెప్పిన 27 ఏళ్ల కొడుకు..

ఈ ప్రాజెక్టు గురించి భారత్ లోని జపాన్ రాయబారి సతోషి సుజుకి మాట్లాడుతూ, “నేను చాలా సంతోషంగా ఉన్నాను, వాస్తవానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సాధించిన పురోగతికి మంత్రముగ్దుడినయ్యాను. మేము రెండవ తరగతి రైలును ఎగుమతి చేయడం లేదు. మేము ఏదైతే వాడుతున్నామో సరిగ్గా అదే (E5 సిరీస్) రైలును భారత్ తో పంచుకుంటాము, ఇంకా మెరుగైన సాంకేతికతను పంచుకుంటాము, ఎందుకంటే ప్రస్తుత సిరీస్ చాలా సంవత్సరాలుగా పనిచేస్తోంది. కాబట్టి, భారతదేశంలో బుల్లెట్ రైలు ప్రాజెక్ర్ట్ సాకారమయ్యే నాటికి, వారు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందేలా మేము చూసుకుంటాము. ప్రస్తుతం జపాన్ ఉత్తర ప్రాంతంలో విరివిగా సేవలు అందిస్తున్న ఈ బుల్లెట్ రైళ్లు వివిధ భద్రతా చర్యలను కలిగి ఉన్నాయి. ఇది యాంటీ సెస్మిక్ టెక్నాలజీని కలిగి ఉంది. జపాన్ మేము పంచుకోగల ఉత్తమమైనది” అని అన్నారు. గుజరాత్ మరియు దాద్రా మరియు నగర్ హవేలీలో, మొత్తం మార్గం నిర్మాణానికి 100 శాతం సివిల్ కాంట్రాక్టులు, అంటే, 352 కిలోమీటర్లు భారతీయ కాంట్రాక్టర్లకు ఇవ్వబడ్డాయి. గుజరాత్ లో ఇప్పటికే 237 కి.మీ మేర ట్రాక్ పనులు పూర్తయ్యాయని, మిగిలిన 115 కి.మీ పనులకు త్వరలో కాంట్రాక్టులు ఇవ్వనున్నారు.

Also read:Lock down in China: చైనాలో కరోనా లాక్ డౌన్: ఆహార కేంద్రాలను దోచుకువెళ్తున్న ప్రజలు