Bihar CM Nitish Kumar : బీహార్ సీఎం సభలో బాంబు దాడి

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సభలో బాంబు కలకలం చెలరేగింది. నలందలో నితీశ్ కుమార్ పాల్గొంటున్న సభపై దుండగుడు బాంబు విసిరాడు.

Bihar CM Nitish Kumar : బీహార్ సీఎం సభలో బాంబు దాడి

Bihar Cm Nitish Kumar

Bihar CM Nitish Kumar : బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సభలో బాంబు కలకలం చెలరేగింది. నలందలో నితీశ్ కుమార్ పాల్గొన్న సభపై దుండగుడు బాంబు విసిరాడు. ఇది సభా ప్రాంగణంలో పడింది. అయితే బాంబు మాత్రం పేలలేదు. దీంతో తృటిలో ప్రమాదం తప్పింది. వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది సీఎం నితీశ్ ను అక్కడి నుంచి సురక్షితంగా తీసుకెళ్లారు.

అనుమానితుడిని అదుపులోకి తీసున్న పోలీసులు అతడిని విచారిస్తున్నారు. అతడు ఎవరు? ఎందుకు ఈ పని చేయాల్సి వచ్చింది? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

నలందలో సీఎం నితీశ్ కుమార్ జనసభకు సమీపంలో ఓ వ్యక్తి పేలుడు పదార్థాన్ని విసిరాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. భద్రతా సిబ్బంది సీఎంకు రక్షణగా నిలిచి అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా సభలో గందరగోళం నెలకొంది. అయితే, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో పోలీసులు, అధికారులు, సభకు వచ్చిన ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

CM Nitish Kumar : బీహార్ సీఎం నితీశ్‌కుమార్‌పై దాడి చేసిన యువకుడు

తొలుత పావాపురిలో జనసభను ముగించుకుని నితీశ్ కుమార్ సిలావ్ చేరుకున్నారు. అక్కడి నుంచి సిలావ్ మీదుగా రాజ్‌గిర్ వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో సిలావ్ గాంధీ హైస్కూల్‌లో జనసభను నిర్వహించారు. వేదిక సమీపంలో దాదాపు 250 మంది నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఈ సమయంలో బాంబు దాడి ఘటన సంభవించింది. వేదికపై ఉన్న సీఎం నితీశ్‌ సహా అంతా ఉలిక్కిపడ్డారు.

కాగా, కొన్ని రోజుల క్రితం నితీశ్ కుమార్ పై దాడి జరిగింది. మతిస్థిమితం లేని వ్యక్తి సీఎం నితీశ్ పై దాడి చేశాడు. ఆ ఘటన జరిగిన కొన్నిరోజుల వ్యవధిలోనే ఈ బాంబు దాడి ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది.

పాట్నాకు సమీపంలోని సీఎం స్వస్థలం భక్తియార్‌పూర్‌లోని స్థానిక ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఓ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో దాడి ఘటన చోటుచేసుకుంది. సీఎం నితీశ్ కుమార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న సమయంలోనే వెనుక నుంచి సెక్యూరిటీని దాటుకుని వేగంగా వేదికపైకి ఎక్కిన ఓ యువకుడు సీఎం నితీశ్‌ వీపుపై దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు.

CM Nitish Kumar: మద్యం తాగేవారంతా మహా పాపులు..వారు భారతీయులు కాదు : సీఎం నితీశ్ కుమార్

తాజాగా ముఖ్యమంత్రికి అత్యంత సమీపంలో జరిగిన బాంబు దాడి ఘటన కలకలం రేపింది. సీఎం చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి లక్ష్యంగా ఇటువంటి దాడులు జరుగుతుండడం భద్రతా వైఫల్యానికి అద్దం పడుతోంది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కి ముప్పు పొంచి ఉందనే వార్తలకు మరోసారి బలం చేకూర్చినట్టయింది.