CM Nitish Kumar: మద్యం తాగేవారంతా మహా పాపులు..వారు భారతీయులు కాదు : సీఎం నితీశ్ కుమార్

మద్యం తాగేవారు మహా పాపులు..వారు భారతీయులు కాదు అంటూ మందుబాబులపై మండిపడ్డారు బీహార్ సీఎం నితీశ్ కుమార్.

CM Nitish Kumar: మద్యం తాగేవారంతా మహా పాపులు..వారు భారతీయులు కాదు : సీఎం నితీశ్ కుమార్

All Drinkers Are Mahapaapi Says Cm Nitish Kumar

All alcohol drinkers are Mahapaapi says CM Nitish Kumar : బీహార్ సీఎం నితీశ్ కుమార్ మందుబాబులపై తీవ్రవ్యాఖ్యలు చేశారు. ‘మద్యం తాగేవారు అంతా మహా పాపులు..వారు అసలు భారతీయులే కాదు’ అంటూ వ్యాఖ్యానించారు. మద్యం తాగేవారికి బాధ్యతలేదని..అలా మద్యం తాగేవారి గురించి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవాలి? అన్నట్లుగా వ్యాఖ్యానించారు. మందు తాగేవాళ్లంతా మహా పాపులు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కల్తీ మద్యం, సారాయి తాగడం వల్ల మృతి చెందే వారి పట్ల ప్రభుత్వం ఎలాంటి బాధ్యత తీసుకోదని..వారి కుటుంబాలకు ఎటువంటి సహాయం అందజేయదు అని స్పష్టం చేశారు సీఎం నితీష్ కుమార్.

Also read : Russia-Ukraine War:నేలపై వైరం..ఆకాశంలో స్నేహం..!ఒకే వ్యోమనౌకలో భూమిపైకి చేరిన రష్యా,అమెరికా వ్యోమగాములు..!!

మద్యం తాగేవారు జాతిపిత మహాత్మా గాంధీ ఆదర్శాలను పట్టించుకోరని అన్నారు. అటువంటివారి గురించి ఎందుకు పట్టించుకోవాలి? అంటూ ప్రశ్నించారు. గాంధీజీ మద్యం సేవించడాన్ని వ్యతిరేకించారని… ఆయన సిద్ధాంతాలను పట్టించుకోకుండా మందు తాగుతున్నవారు ముమ్మాటికీ మహా పాపులేనని నితీశ్ అన్నారు. అలా మద్యం తాగేవాళ్లను తాను భారతీయులుగా గుర్తించను అని స్పష్టంచేశారు.

బీహార్ లో మద్య నిషేధం చేశామని అన్నారు. మందు తాగడం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా చాలా మంది దాన్ని తాగుతున్నారు..సేవిస్తున్నారని… దీని వల్ల జరిగే పర్యవసానాలకు వారే బాధ్యులని తెలిపారు. మందు విషంతో సమానమని తెలిసినా తాగుతున్నారు అంటూ తీవ్రంగా మందుబాబులపై మండిపడ్డారు సీఎం నితీశ్ కుమార్. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన సీఎం నితీశ్ కుమార్ పై ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

Also read : Karnataka : ‘హలాల్’ కట్ మాంసాన్ని కొనవద్దంటూ హిందూ సంస్థలు పిలుపు..స్పందించిన సీఎం బసవరాజ్ బొమ్మై

రాష్ట్రంలో మద్య నిషేధాన్ని అమలు చేయడంలో నితీశ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని విమర్శిస్తున్నాయి. బీహార్‌లో ప్రభుత్వం నిర్వహించిన సర్వే ప్రకారం 2018 నాటికి 1 కోటి 74 లక్షల మంది మద్యం సేవించడం మానేశారని సీఎం తెలిపారు. మద్యపానం ద్వారా వచ్చే ఆదాయం కారణంగా రాష్ట్రాలు మద్యపానాన్ని నిషేధించవని..అయితే “ఎవరైనా, మద్యం కోసం డబ్బును వృధా చేస్తున్నారని..మద్యపానం మానేస్తే ఆ డబ్బుని తన ఇంటి కోసం ఉపయోగిస్తాడు అని అన్నారు. అందరి కుటుంబాలు బాగుండాలనే ఉద్ధేశ్యంతో రాష్ట్రంలో మద్యపాన నిషేధం కొనసాగిస్తున్నామని..ఎవరైనా మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.