Russia-Ukraine War:నేలపై వైరం..ఆకాశంలో స్నేహం..!ఒకే వ్యోమనౌకలో భూమిపైకి చేరిన రష్యా,అమెరికా వ్యోమగాములు..!!

నేలపై వైరం..ఆకాశంలో స్నేహం అన్నట్లుగా..!ఒకే వ్యోమనౌకలో భూమిపైకి చేరారు రష్యా,అమెరికా వ్యోమగాములు..

Russia-Ukraine War:నేలపై వైరం..ఆకాశంలో స్నేహం..!ఒకే వ్యోమనౌకలో భూమిపైకి చేరిన రష్యా,అమెరికా వ్యోమగాములు..!!

Russia Ukraine War..nasa Astronauts Returned

Russia-Ukraine War..NASA Astronauts Returned : యుక్రెయిన్‌ యుద్ధం అమెరికా-రష్యాల మధ్య చిచ్చు పెట్టింది. యుక్రెయిన్ పై యుద్దాన్ని అమెరికా తీవ్రంగా రష్యాను తప్పుపడుతోంది. యుక్రెయిన్ కు ఆయుధాల సహాయం చేస్తోంది. కానీ రష్యా మాత్రం గత నెల రోజులుగా యుక్రెయిన్ పై యుద్ధాన్ని కొనసాగిస్తునే ఉంది. ఇరు దేశాలమధ్యా యుక్రెయిన్ యుద్ధం చిచ్చు పెట్టిన ఈ క్రమంలో రష్యా-అమెరికాల మధ్య ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. భూమ్మీద అమెరికా-రష్యాలు యుక్రెయిన్ విషయంలో తీవ్రంగా వ్యతిరేకించుకుంటున్న ఈ సమయంలో అంతరిక్షంలో మాత్రం రష్యా-అమెరికాలు స్నేహాన్ని ప్రదర్శించాయి. అదేమంటే..అమెరికా, రష్యాకు చెందిన వ్యోమోగాములు ఒకే వ్యోమోనౌకలో కలిసి భూమ్మీదకు సురక్షితంగా చేరారు. ఈ సన్నివేశం ఆసక్తికరంగా మారింది.

Also read : Ukraine – Russia War : టర్కీ టాక్స్ సక్సెస్.. యుక్రెయిన్ ‌- రష్యా యుద్ధం ఇక ముగిసినట్టే..!

అంతరిక్షంలోని ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ నుంచి అమెరికన్‌, ఇద్దరు రష్యన్‌ వ్యోమగాములు ఒకే క్యాప్యూల్‌లో భూమిపైకి బుధవారం తెల్లవారుజామున 3:21 గంటలకు (మార్చి 30,2022) సురక్షితంగా దిగారు. యుద్ధ పరిణామాలు ఇరు దేశాలకు చెందిన వ్యోమోగాముల మధ్య ఎటువంటి ప్రభావాలు చూపించలేదని చెప్పటానికి ఈ అరుదైన సన్నివేశమే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. యుక్రెయిన్‌ యుద్ధం అమెరికా, రష్యా సంబంధాలపై గతంలో ఎప్పుడూ లేనంత రేంజ్ లో వైరాన్ని రగిలించింది. అమెరికా రష్యాకు వార్నింగ్ లు మీద వార్నింగ్ లు ఇస్తోంది. అయినా రష్యా మాత్రం అమెరికా వార్నింగ్ లను ఏమాత్రం ఖాతరు చేయకుండా తాను అనుకున్నదారికి యుక్రెయిన్ వచ్చే వరకు యుద్ధాన్ని ఆపేది లేదంటోంది. రష్యాకు వ్యతిరేకంగా అమెరికా అనేక ఆంక్షలను విధించింది. అటు బైడెన్‌, ఇటు పుతిన్‌ పరిధిని దాటి మరీ ఒకరిపై మరొరకు నిందలు మోపుకుంటున్నారు.

Also read : Russia Armed Forces Killed : యుద్ధంలో 17,200 మంది రష్యన్ సైనికులను హతమార్చామన్న యుక్రెయిన్ ఆర్మీ

ఈ క్రమంలో ఇరు దేశాలకు (రష్యా-అమెరికా)చెందిన వ్యోమగాములు ఒకే వ్యోమనౌకలో భూమికి చేరడం ఈ సమయంలో అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. అంతరిక్షంలోని ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌-ISS నుంచి ముగ్గురు వ్యోమగాములు కజకిస్తాన్‌లో (కజకిస్తాన్ సమయం సాయంత్రం 5:28)కి సురక్షితంగా ల్యాండ్‌ అయ్యారు. ఇందులో ఒకరు అమెరికన్‌,ఇద్దరు రష్యన్లు ఉన్నారు.

అమెరికాకు చెందిన మార్క్‌ వాండేహె, రష్యాకు చెందిన ఆంటోన్‌ ష్కప్లెరోవ్‌, ప్యోర్ట్‌ దుబ్రోవ్‌ ఒకే క్యాప్యూల్‌లో భూమి మీదకు వచ్చారు.. అంతరిక్ష వాతావరణం నుంచి భూ వాతావరణంలోకి మారే క్రమంలో వీరికి సాంకేతిక, వైద్య సిబ్బంది ఈ ముగ్గురు వ్యోమగాములకు సహాయపడ్డారు.. నాసాకు చెందిన వ్యోమగామి మార్క్‌ వాండేహె రెండోసారి అంతరిక్షంలోకి వెళ్లాడు.. మొదటి సారి 340 రోజులు ISSలో గడిపాడు. రెండోసారి ఏకంగా 355 రోజలు ఉండి సరికొత్త రికార్డు నెలకొల్పాడు మార్క్‌ వాండేహె..

Also read : Karnataka : ‘హలాల్’ కట్ మాంసాన్ని కొనవద్దంటూ హిందూ సంస్థలు పిలుపు..స్పందించిన సీఎం బసవరాజ్ బొమ్మై

ఈ ముగ్గురు వ్యోగగాములు అంతరిక్షంలో ఉన్నప్పుడు భూమి మీద జరుగుతున్న ఘటనలన్నీ తెలుసు.. ఉక్రెయిన్‌ వార్‌ ఎఫెక్ట్‌ ఇరు దేశాల మధ్య సంబంధాలను దెబ్బ తీసినా, వీరు మాత్రం ఎలాంటి అరమరికలు లేకుండా కలిసి పనిచేస్తున్నారు. రష్యన్ వ్యోమగాములు భూమి మీదకు దిగే సమయంలో యుక్రెయిన్‌కు మద్దతుగా రష్యా జెండా రంగు పసుపు, నీలం ప్రదర్శిస్తారని ఊహాగానాలు వినిపించినా,అటువంటిదేమీ కనపించలేదు. ఆప్యాయంగా కరచాలనాలు, కౌగిలింతల స్వాగతం మాత్రమే కనిపించటం గమనించాల్సిన విషయం. కాగా..రష్యన్ అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ కజఖ్ స్టెప్పీ ఈ వ్యోమగాములు భూమిపైకి వచ్చే సన్నివేశాన్ని ప్రత్యక్షంగా ప్రసారం చేయటం మరో విశేషం.