Karnataka : ‘హలాల్’ కట్ మాంసాన్ని కొనవద్దంటూ హిందూ సంస్థలు పిలుపు..స్పందించిన సీఎం బసవరాజ్ బొమ్మై

కర్ణాటకలో ‘హలాల్’ కట్ మాంసాన్ని కొనవద్దంటూ హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి. దీనిపై స్పందించిన సీఎం బసవరాజ్ బొమ్మై ఏమన్నారంటే..

Karnataka : ‘హలాల్’ కట్ మాంసాన్ని కొనవద్దంటూ హిందూ సంస్థలు పిలుపు..స్పందించిన సీఎం బసవరాజ్ బొమ్మై

Karnataka Demand For Ban On Halal Meat During Ugadi

Karnataka demand for ban on halal meat during Ugadi : కర్ణాటకలో హిందూ ముస్లింల మధ్య వివాదాలు ముదురుతున్నాయా? రెండు సామాజిక వర్గాలకు మధ్య మత విశ్వాల విషయంలో చిచ్చు చల్లారటంలేదా? అంటే మరో రచ్చతో నిజమేనేమోననిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు కర్ణాటకలో ‘హిజాబ్’వివాదం కార్చిచ్చులా రాజుకుని దేశంలోని కొన్ని రాష్ట్రాలకు పాకింది. నిన్న మొన్నా..హిందూ ఆలయాల్లో, జాతరలలో ముస్లిం వ్యాపారాలను బహిష్కరించాలంటూ కొత్త ఆంశం రాష్ట్రమంతా వ్యాపించింది. ముందుగా రాష్ట్రంలోని ఉడుపి, దక్షిణకన్నడ జిల్లాల్లో తలెత్తిన ఈ వివాదం ఇప్పుడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వ్యాపించింది.

ఇప్పుడు తాగా ఉగాది వేడుకల ముందు మాంసం కొనుగోలు విషయంలో ముస్లింలో మరోసారి ‘హలాల్’ అంటూ వివాదాన్ని తెరపైకి తెచ్చారు. కర్ణాటకలో హలాల్(Halal ) చేసిన మాంసాన్ని బహిష్కరించాలంటూ ప్రచారం మొదలైంది. దీంతో మరోసారి వివాదాలు తెరపైకి వచ్చాయి. ‘హలాల్’ ( జంతువులు, పక్షులను చంపే ముందు వాటిని చంపే నియమాన్ని హలాల్ అంటారు)మాంసాన్ని కొనవద్దంటూ హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి. బహిష్కరణపై హిందువుల నుంచి అనుకూలత లభిస్తుండటం.. ముస్లింల నుంచి వ్యతిరేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Hijab Row : ఇస్లాంలో హిజబ్ తప్పనిసరి కాదు.. కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు..!

ఈక్రమంలో హలాల్ మాంసం బహిష్కరణ ప్రచారం గురించి కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై బుధవారం (మార్చి 30,2022) స్పందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..‘చాలా సంస్థలు అనేక సమస్యలపై నిషేధిస్తున్నాయి. వాటిపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేశారు. కానీ ఇది ప్రభుత్వం చెబుతున్నట్లు కాదనే విషయం గమనించాలన్నారు. ఏ సమయంలో ఏ ప్రకటన చేయాలో అప్పుడు పరిస్థితులను బట్టి స్పందిస్తానని..ఈ విషయాన్ని పరిశీలిస్తాం అని తెలిపారు.

సీఎం ఈ సందర్భంగా రాష్ట్రంలో హిజాబ్ సమస్యతోపాటు ఇతర కేసులలో న్యాయ వ్యవస్థ రక్షణ కల్పిస్తుందన్నారు. సామాన్యులకు శాంతి, అభివృద్ధి, భద్రతే మా ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. మొదటి నుంచి కొన్ని నియమాలు, ఆచారాలు ఉన్నాయని అన్న ఆయన మా ప్రభుత్వం అభివృద్ధిపైనే దృష్టి సారిస్తోంది అని తెలిపారు. మా ప్రభుత్వానికి సంబంధించినంత వరకు రైట్ వింగ్ డిమాండ్ చేసిందా? లెఫ్ట్ వింగ్ డిమాండ్ చేసిందా? అనేది ప్రధానం కాదని.. తమ ప్రధాన ఆలోచన శాంతి, అభివృద్ధి, సామాన్యులకు భద్రత ఇవ్వటమే ముఖ్యం అని సీఎం బొమ్మై స్పష్టం చేశారు.

Hijab Row: సిక్కు మతానికి చెందిన ఆరేళ్ల బాలుడికి స్కూల్ అడ్మిషన్ నిరాకరణ

హలాల్ మాంసం బహిష్కరణ తప్పు: హిందూ జాతరల సమయంలో ముస్లిం వ్యాపారులను నిషేధించిన తర్వాత హలాల్ బహిష్కరణ అనే అంశం తెరపైకి వచ్చింది. హలాల్‌ చేసి వధించిన కోడి, గొర్రెలు, మేక మాంసాన్ని బహిష్కరించాలంటూ కొన్ని హిందూ సంస్థలు ప్రచారం ప్రారంభించాయి. ఇదెలా ఉందంటే..వారి మమ్మల్ని నిషేధిస్తున్నారు కాబట్టి మేం కూడా నిషేధిస్తాం అన్నట్లుగా ఉంది. ఇలా చిన్న చిన్న విషయాలు పెద్దవిగా వివాదంగా పరిణమిస్తున్నాయి. తాము కొంటున్న మాంసాన్ని హలాల్ చేయవద్దని ముస్లిం వ్యాపారులను విజ్ఞప్తి చేస్తున్నారు.

కాగా..ఉగాది పండగ మరుసటి రోజు హొసతోడకు జరుపుకుంటారు. మైసూరు, రామనగర, మాండ్య జిల్లాలలో కొత్త సంవత్సర వేడుకలలో ఇది ఉంటుంది. చాలా మంది హిందువులు ఆ రోజు మాంసం తింటారు. అయితే ముస్లిం వ్యాపారుల నుంచి హొసతోడకు మాంసం కొలుగోలు చేయవద్దు అని రైట్ వింగ్ గ్రూపులు హిందువులను కోరుతున్నాయి. ఈ మాంసాన్ని హిందూ దేవతలకు నైవేద్యంగా పెట్టకూడదని చెబుతున్నాయి.

Hijab Row: కర్ణాటకలో కొత్త వివాదం.. ముదిరిన ఆలయాల్లో ముస్లిం వ్యాపారాల బహిష్కరణ

అసలు హలాల్ కట్ అంటే ఏమిటంటే..జంతువులు, పక్షులను చంపే ముందు వాటిని చంపే నియమాన్ని హలాల్ అంటారు. ఇది ముస్లిం మతాచారంలో తప్పనిసరి. జంతువుకు మొదట నీరు పోసి మక్కా ముఖం వైపుగా ఆ జంతువును వధించాలి. తలను పూర్తిగా నరికివేయకుండా గొంతును సగం వరకు మాత్రమే కట్ చేసి.. జంతువు శరీరం నుంచి రక్తం మొత్తం బయటకు వెళ్లాలి. చంపే వ్యక్తి తప్పనిసరిగా ముస్లిం వ్యక్తి అయి ఉండాలి. వారు నమ్మే దేవుడికి ఆ జంతువును బలి ఇస్తున్నట్లుగా చెప్పిన తర్వాత వధించబడాలి. వధకు ముందే ఆ జంతువు చనిపోకూడదు. హలాల్ మాంసం ఈ పద్ధతిలో మతపరంగా తయారు చేయబడుతుంది.