Hijab Row: కర్ణాటకలో కొత్త వివాదం.. ముదిరిన ఆలయాల్లో ముస్లిం వ్యాపారాల బహిష్కరణ

క‌ర్ణాట‌క‌లో హిజాబ్ వివాదంఎంత వివాదం సృష్టించిందో తెలిసిందే. దేశం మొత్తం ప్రభావం చూపిన హిజాబ్ వివాదం మ‌రిచిపోక‌ముందే కర్ణాటక రాష్ట్రంలో మ‌రోవివాదం..

Hijab Row: కర్ణాటకలో కొత్త వివాదం.. ముదిరిన ఆలయాల్లో ముస్లిం వ్యాపారాల బహిష్కరణ

Hijab Row

Hijab Row: క‌ర్ణాట‌క‌లో హిజాబ్ వివాదంఎంత వివాదం సృష్టించిందో తెలిసిందే. దేశం మొత్తం ప్రభావం చూపిన హిజాబ్ వివాదం మ‌రిచిపోక‌ముందే కర్ణాటక రాష్ట్రంలో మ‌రోవివాదం తెర‌మీద‌కు వ‌చ్చింది. హిందూ ఆలయాల్లో, జాతరలలో ముస్లిం వ్యాపారాలను బహిష్కరించాలంటూ కొత్త ఆంశం రాష్ట్రమంతా వ్యాపించింది. ముందుగా రాష్ట్రంలోని ఉడుపి, దక్షిణకన్నడ జిల్లాల్లో తలెత్తిన ఈ వివాదం ఇప్పుడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వ్యాపించింది.

Hijab Row: సుప్రీం కోర్టు మెట్లెక్కనున్న ముస్లిం విద్యార్థులు

మొదట్లో ఉడిపి జిల్లాలో ఏటా జరిగే కాపు మరిగుడి పండుగ సందర్భంగా హిందూయేతర వ్యాపారులు, వ్యాపారులకు ప్రవేశం ఉండకూడదని బ్యానర్లు వేయగా.. ఆ తర్వాత పడుబిద్రి ఆలయ ఉత్సవాల్లో, దక్షిణ కన్నడ జిల్లాలోని కొన్ని దేవాలయాలలో కూడా ఇలాంటి బ్యానర్లు ప్రదర్శన‌మిచ్చాయి. కొన్ని హిందూ అనుకూల సంస్థల అభ్యర్థనను మారి గుడి ఆలయ నిర్వాహకులు పట్టించుకోకపోగా.. కొంతమంది హిందూ కార్యకర్తలు ఈ విషయంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల అధికారులకు మెమోరాండాలను సమర్పించారు.

Hijab Row : ఇస్లాంలో హిజబ్ తప్పనిసరి కాదు.. కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు..!

తాజాగా కొడగు జిల్లా సోమవారపేట తాలూకా శనివారసంతె మనేహళ్లిమఠంలో జరిగిన కులగోవుల సమ్మేళనం వేళ ముస్లిం వ్యాపారాలను నిషేధించాలని వీహెచ్‌పీ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన దుకాణాలను తొలగించారు. చిక్కమగళూరు తాలూకా ఖాండ్యా హోబళి హుయిగెరె గ్రామంలో కోలా ఉత్సవంలోనూ వివాదం తలెత్తింది. హిజాబ్ అంశంపై కర్ణాటక హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఇటీవల ముస్లింలు బంద్‌కు మద్దతు తెలిపినందుకు ప్రతీకారంగా ఈ చర్య తీసుకున్నట్లు హిందూ కార్యకర్తలు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు.

Hijab Row: సిక్కు మతానికి చెందిన ఆరేళ్ల బాలుడికి స్కూల్ అడ్మిషన్ నిరాకరణ

ఇక, రెండు రోజులుగా శాసనసభ, విధానపరిషత్‌లోనూ ఇదే అంశంపై చర్చలు సాగగా న్యాయశాఖ మంత్రి మాధుస్వామి వివరణ ఇచ్చారు. 2002 కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఆలయాల పరిధిలో ఇతర మతస్థులు వ్యాపారాలు చేయకుండా నిషేధం విధించగా.. దానినే అమలు చేస్తున్నామని తెలిపారు. దేవాల‌యాలు, ఆథ్యాత్మిక సంస్థకు సమీపంలో ఉన్న భూమి, భవనం లేదా స్థలంతో సహా ఎటువంటి ఆస్తిని హిందువులు కానివారికి లీజుకు ఇవ్వరాదని నిబంధ‌న‌ల్లో పేర్కొన్నట్టు వివ‌రించారు.