Jawed Habib: మహిళ జుట్టుపై ఉమ్మిన ఘటనపై క్షమాపణలు చెప్పిన జావేద్

ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో జరిగిన సెమినార్ లో..ఒక మహిళకు కేశాలంకరణ చేస్తున్న జావేద్ హబీబ్, ఆమె జుట్టుపై ఉమ్మివేశాడు.

Jawed Habib: ప్రముఖ సెలబ్రిటీ హెయిర్ స్టయిలిస్ట్ జావేద్ హబీబ్.. తన చర్యపై క్షమాపణ చెప్పాడు. ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో జరిగిన సెమినార్ లో..ఒక మహిళకు కేశాలంకరణ చేస్తున్న జావేద్ హబీబ్, ఆమె జుట్టుపై ఉమ్మివేశాడు. తాను నీటికి బదులుగా ఉమ్మి వేస్తాని, దంతో జుట్టును అందుకోవడం తేలికగా ఉందంటూ మహిళతో చెప్పాడు. ఈ ఘటనను సెమినార్ కు వచ్చిన కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. పబ్లిక్ గా ఒక మహిళ జుట్టుపై జావేద్ హబీబ్ ఉమ్మి వేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. జావేద్ తీరుపై స్వర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. బాయ్ కాట్ జావేద్ హబీబ్ అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు.

Also read: Dog saves Owner: కిడ్నాప్ నుంచి యజమానిని రక్షించిన శునకం

ఇక ఈ ఘటనపై జావేద్ హబీబ్ స్పందించారు. ఉమ్మి వేసిన ఘటనపై తాను ఎంతో చింతిస్తున్నట్లు జావేద్ పేర్కొన్నారు. తాను అలా చేయాల్సింది కాదని, అందుకు క్షమాపణ కోరుతున్నట్టు జావేద్ పేర్కొన్నాడు. ఇంస్టాగ్రామ్ వేదికగా స్పందించిన జావేద్ హబీబ్, సదరు మహిళ జట్టుపై ఉమ్మి వేయడం అనుకోకుండా జరిగిపోయిందని వివరించారు. కాగా ఈఘటనపై పూర్తి వివరణ ఇవ్వాలంటూ జాతీయ మహిళా కమిషన్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుత కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉమ్మి వేయడం శిక్షార్హమైన నేరమని.. కావున జావేద్ హబీబ్ పై.. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ 2005 ప్రకారం కేసు నమోదు చేయాలనీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు లేఖ రాసింది.

Also read: Corona Cases: ఏడు నెలల తరువాత 1 లక్షకు చేరిన రోజువారీ కరోనా కేసులు

ట్రెండింగ్ వార్తలు