Jeet Adani Diva Shah Marriage : ఘనంగా గౌతమ్‌ అదానీ కుమారుడి వివాహం.. పెళ్లి ఫోటోలు చూశారా..

జైన్‌, గుజరాతీ సంప్రదాయంలో పెళ్లి వేడుకలు జరిపించారు.

Jeet Adani Diva Shah Marriage : ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ చిన్న కొడుకు జీత్‌ అదానీ – దివా జైమిన్ షాల పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. గుజరాతీ సంప్రదాయంలో వీరి వివాహం జరిపించారు. అహ్మదాబాద్‌లో కొంతమంది బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి జరిగింది. జీత్ అదానీ- దివా షాల పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also Read : రతన్ టాటా వీలునామాలో షాకింగ్ పేరు? ఎవరీ మోహిని మోహన్ దత్తా.. ఈ మిస్టరీ మ్యాన్‌కు రూ. 500 కోట్లు రాసిచ్చాడు!

ఆత్మీయుల నడుమ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి వేడుక జరిగినట్లు అదానీ తెలిపారు. అతి తక్కువ మంది సమక్షంలో జరిగిన ఈ వేడుకకు శ్రేయోభిలాషులను ఆహ్వానించలేకపోయానని, అందుకు తనను క్షమించాలన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించాలని ఆయన కోరారు.

అహ్మదాబాద్‌లోని అదానీ టౌన్‌షిప్‌ వేదికగా శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు వివాహ కార్యక్రమాలు మొదలయ్యాయి. జైన్‌, గుజరాతీ సంప్రదాయంలో పెళ్లి వేడుకలు జరిపించారు. ఎలాన్‌ మస్క్, బిల్‌ గేట్స్‌, టేలర్ స్విఫ్ట్ వంటి ఇంటర్నేషనల్ సెలబ్రిటీలను అదానీ ఆహ్వానిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే, కుంభమేళాలో పాల్గొన్న సందర్భంగా ఆ ప్రచారాన్ని గౌతమ్‌ అదానీ తోసిపుచ్చారు.

ఎవరీ జీత్ అదానీ..
జీత్ అదానీ గౌతమ్ అదానీ చిన్న కొడుకు. అదానీ ఎయిర్‌పోర్ట్స్‌లో డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. 2019లో గ్రూప్ CFO కార్యాలయంలో తన కెరీర్‌ను ప్రారంభించాడు. అదానీ గ్రూప్‌లోని వ్యూహాత్మక ఫైనాన్స్, క్యాపిటల్ మార్కెట్‌, రిస్క్ మేనేజ్‌మెంట్, గవర్నెన్స్ విధానాలపై దృష్టి సారించాడు.

యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ అప్లైడ్ సైన్సెస్‌లో గ్రాడ్యుయేట్ అయిన జీత్ శిక్షణ పొందిన పైలట్ కూడా. అతని తల్లి, ప్రీతి అదానీ ప్రేరణతో, అతను దాతృత్వ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నాడు. ఆమె వారసత్వాన్ని అనుసరించి అదానీ ఫౌండేషన్‌ను ఒక ప్రధాన సామాజిక ప్రభావ సంస్థగా మార్చారు.

Also Read : అదానీ కొడుకు పెళ్లికి జస్ట్ రూ.10 లక్షలే ఖర్చు..

ఎవరీ దివా జైమిన్ షా…
ప్రముఖ వజ్రాల వ్యాపారి, సి. దినేశ్ అండ్ కో ప్రైవేట్ లిమిటెడ్ సహ యజమాని జైమిన్ షా కూతురే దివా జైమిన్ షా. ప్రముఖ వజ్రాల తయారీ సంస్థగా గుర్తింపు పొందిన ఈ కంపెనీ ముంబై, సూరత్‌లలో గణనీయమైన కార్యకలాపాలను కలిగి ఉంది. దివా షా హయ్యర్ ఎడ్యుకేషన్ పూర్తి చేసినా.. లో ప్రొఫైల్ మెయింటేన్ చేస్తారు. సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు. ఫైనాన్స్, వ్యాపార రంగాల్లో దివా టాలెంట్ అదానీ ఫ్యామిలీని అట్రాక్ట్ చేసిందట.