Jharkhand Truck Driver : ట్రక్ డ్రైవర్.. వంటల వీడియోలతో ఫేమస్ అయ్యాడు.. నెలకు రూ. 10 లక్షలు సంపాదన..!

Jharkhand Truck Driver : సిద్ధార్థ్ కన్నన్‌తో రాజేష్ మాట్లాడుతూ.. ట్రక్ డ్రైవర్‌గా నెలకు రూ. 25వేల నుంచి రూ. 30వేల వరకు సంపాదిస్తున్నట్లు వెల్లడించాడు. యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఆదాయం వ్యూయర్స్ సంఖ్యను బట్టి మారుతుంది.

Jharkhand Truck Driver : ట్రక్ డ్రైవర్.. వంటల వీడియోలతో ఫేమస్ అయ్యాడు.. నెలకు రూ. 10 లక్షలు సంపాదన..!

Jharkhand Truck Driver-Turned-YouTuber

Jharkhand Truck Driver : అతడో ట్రక్ డ్రైవర్.. డ్రైవింగ్‌లో అపారమైన అనుభవం ఉంది. దేశీయ రహదారులను రెండు దశాబ్దాలకు పైగా చుట్టేస్తున్నాడు. కట్ చేస్తే.. ఊహించని విధంగా ఆన్‌లైన్‌లో ఫుల్ ఫేమస్ అయిపోయాడు. యూట్యూబ్ యూజర్లు కూడా అంతగా అతడి వీడియోలను ఆదరించారు. అతడే రాజేష్ రావాని.. కేవలం డ్రైవింగ్ మాత్రమే కాదు.. వంట చేయడంలో కూడా అంతే అనుభవం ఉంది. వంట పట్ల అతనికి ఉన్న మక్కువే రాజేష్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించేలా చేసింది.

Read Also : Zomato Instant Balance : జొమాటో ఇన్‌స్టంట్ బ్యాలెన్స్ ఫీచర్‌.. ఇదేంటి? కస్టమర్లకు బెనిఫిట్స్ ఏంటి?

అప్పటి నుంచి 1.86 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లను యూట్యూబర్ సంపాదించుకున్నారు. రాజేష్ కొత్త ఇంటిని కొనుగోలు చేయగలిగాడు. ఇటీవలి ఇంటర్వ్యూలో రాజేష్ తన ఆర్థిక విషయాల గురించి రివీల్ చేశాడు. ప్రస్తుతం తన మొదటి ఇంటిని నిర్మిస్తున్నట్లు చెప్పాడు. తన చేతికి గాయమైన తీవ్రమైన ప్రమాదం నుంచి బయటపడినట్లు వివరించాడు. అయితే, అతని కుటుంబ అవసరాలు, కొనసాగుతున్న ఇంటి నిర్మాణం కారణంగా డ్రైవింగ్ కొనసాగించినట్టు తెలిపాడు.

నెలకు రూ. 30వేల వరకు సంపాదన :
సిద్ధార్థ్ కన్నన్‌తో రాజేష్ మాట్లాడుతూ.. ట్రక్ డ్రైవర్‌గా నెలకు రూ. 25వేల నుంచి రూ. 30వేల వరకు సంపాదిస్తున్నట్లు వెల్లడించాడు. యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఆదాయం వ్యూయర్స్ సంఖ్యను బట్టి మారుతుంది. సాధారణంగా రూ. 4లక్షల నుంచి 5 లక్షల వరకు ఉంటుంది. ఒక నెలలో మాత్రం ఏకంగా రూ. 10 లక్షలు సంపాదించాడు.

రాజేష్ తన మొదటి వైరల్ వీడియోను గుర్తుచేసుకున్నాడు. “నేను వాయిస్‌ఓవర్‌తో ఒక వీడియోను పోస్ట్ చేశాను. నా ముఖాన్ని బహిర్గతం చేయమని ఫాలోవర్లు నన్ను అడుగుతూనే ఉన్నారు. నా కొడుకు నా ముఖాన్ని చూపించే వీడియో చేశాడు. దానికి కేవలం ఒక్క రోజులో 4.5 లక్షల వ్యూస్ వచ్చాయి”.

ఒకవైపు డ్రైవింగ్.. మరోవైపు కూకింగ్ వీడియోలు :
ఒకవైపు ట్రక్కింగ్ ఉద్యోగం చేస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ రెండింటినీ ఏకకాలంలో మ్యానేజ్ చేసేవాడు. దీనికి అతడి కుటుంబం కూడా ఫుల్ సపోర్టు అందించింది. తన కుటుంబంలో మొత్తం ఐదుగురు సభ్యులు ఉంటారు. తాను డ్రైవర్‌గా ఉన్న తండ్రి ఏకైక ఆధారమని కూడా షేర్ చేశాడు. ప్రతి నెలా, అతని తండ్రి రూ. 500 పంపేవాడు.

అది ఏమాత్రం సరిపోదని, కుటుంబం రుణాలపై ఆధారపడవలసి వచ్చేది. ఆగష్టు 18న ఉదయం 11:30 గంటలకు పోస్టు చేసిన వీడియోలో రాజేష్ గౌహతికి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు బీహార్ వరదల గురించి చర్చించాడు. తన గమ్యాన్ని చేరుకోవడానికి ఇంకా 850 కి.మీ వెళ్లాల్సి ఉందని అందులో పేర్కొన్నాడు.

Read Also : Zomato Group Ordering : జొమాటోలో గ్రూపు ఆర్డరింగ్ ఫీచర్.. ఒకేసారి అందరూ ఆర్డర్ చేయొచ్చు.. ఎలా పనిచేస్తుందంటే?