Viral Video : వావ్ అనిపిస్తున్న బావ – మరదలి డాన్స్

జిజాజి (బావ)తో మరదలు బాలీవుడ్ పాట 'Kyun aage peeche dolte ho' డ్యాన్స్ చేశారు. చీర ధరించిన మరదలు..ఒయ్యారంగా డ్యాన్స్ చేసుకుంటూ...ముందుకు వస్తుండగా..కొద్ది కొద్దిగా సిగ్గు పడుతూ..బావ హావాభావాలు పలికించడం నెటిజన్లను ఆకర్షిస్తోంది.

Viral Video : వావ్ అనిపిస్తున్న బావ – మరదలి డాన్స్

Jiju

Updated On : July 9, 2021 / 3:31 PM IST

Jija Saali ka Bindaas Dance : సరదాగా నవ్వుకోవడానికి, నవ్వించడానికి కొంటె బావ తుంటరి మరదలు చిలిపి చేష్టలు అందరి కుటుంబాల్లో కనిపిస్తుంటాయి. బావను ఆటపట్టించడంలో..ఎగతాళి చేయడానికి మరదలు ప్రయత్నిస్తుంటారు. అయితే..బావ..మరదలి మధ్య తీపి బంధాన్ని వర్ణించే ఓ వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో జిజాజి (బావ)తో మరదలు బాలీవుడ్ పాట ‘Kyun aage peeche dolte ho’ డ్యాన్స్ చేశారు.

చీర ధరించిన మరదలు..ఒయ్యారంగా డ్యాన్స్ చేసుకుంటూ…ముందుకు వస్తుండగా..కొద్ది కొద్దిగా సిగ్గు పడుతూ..బావ హావాభావాలు పలికించడం నెటిజన్లను ఆకర్షిస్తోంది. చివరిలో మరదలి..చెంపలను సుతారంగా..రుద్దడం…అనంతరం..చిన్న స్టెప్పులు వేయడం వీడియోలో కనిపించింది. boldmeeraswag దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియోలో పోస్టు చేశారు. నెటిజన్లను ఈ వీడియో విపరీతంగా ఆకర్షించింది. 22,166 likes సంపాదించింది. కొంతమంది సరద సరదా కామెంట్స్ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Bold Meera (@boldmeeraswag)