Indias Name : ఇండియా పేరును భారత్‌గా మార్చండి…బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

ఇండియా పేరు విషయంలో బీజేపీ ఎంపీ హరనాథ్ సింగ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా పేరును భారత్‌గా మార్చాలని బీజేపీ ఎంపీ హరనాథ్ సింగ్ యాదవ్ పిలుపునిచ్చారు. బ్రిటిష్ వారు ఇండియా పదాన్ని దుర్వినియోగంగా ఉపయోగించారని చెప్పారు....

Indias Name : ఇండియా పేరును భారత్‌గా మార్చండి…బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

BJP MP Harnath Singh Yadav

Updated On : September 5, 2023 / 11:31 AM IST

Indias Name : ఇండియా పేరు విషయంలో బీజేపీ ఎంపీ హరనాథ్ సింగ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా పేరును భారత్‌గా మార్చాలని బీజేపీ ఎంపీ హరనాథ్ సింగ్ యాదవ్ పిలుపునిచ్చారు. బ్రిటిష్ వారు ఇండియా పదాన్ని దుర్వినియోగంగా ఉపయోగించారని చెప్పారు. భారత రాజ్యాంగంలోని ఇండియా అనే పదాన్ని ఆ స్థానంలో భారత్ అని పెట్టాలని బీజేపీ ఎంపీ సూచించారు. ఇండియా అనే పదానికి బదులుగా భారత్ అనే పదాన్ని ఉపయోగించాలని దేశం మొత్తం డిమాండ్ చేస్తోందని ఎంపీ పేర్కొన్నారు.

JK Terrorist killed : జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్..ఉగ్రవాది హతం

‘‘భారత్’’ అనే పదం మన సంస్కృతికి ప్రతీక అని, రాజ్యాంగంలో మార్పు రావాలని ఆయన కోరారు. ఇటీవల ప్రతిపక్షం తన కూటమికి ఇండియా (I.N.D.I.A) అని పేరు పెట్టింది. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ-ఎన్‌డీఏతో తలపడాలని యోచిస్తున్న 28 పార్టీలు ఇండియా కూటమిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా పేరునే మార్చాలని బీజేపీ ఎంపీ డిమాండ్ చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.