Jio Happy New Year Offer : జియో యూజర్లకు హ్యాపీ న్యూఇయర్ ఆఫర్.. కొన్ని రోజులు మాత్రమే
టెలికాం రంగంలో సంచలనాలకు మారుపేరు రిలయన్స్ జియో. ఇప్పటికే ఊహించని విధంగా ఎన్నో ఆఫర్లు తీసుకొచ్చింది. తాజాగా ఈ టెలికాం దిగ్గజం న్యూఇయర్ ను పురస్కరించుకుని తన యూజర్లకు కొత్త ఆఫర్..
- Naveen
- Published On : December 25, 2021 / 11:52 PM IST
Reliance Jio
Jio Happy New Year Offer : టెలికాం రంగంలో సంచలనాలకు మారుపేరు రిలయన్స్ జియో. ఇప్పటికే ఊహించని విధంగా ఎన్నో ఆఫర్లు తీసుకొచ్చింది. తాజాగా ఈ టెలికాం దిగ్గజం న్యూఇయర్ ను పురస్కరించుకుని తన యూజర్లకు కొత్త ఆఫర్ ప్రకటించింది. రూ.2,545 ప్రీపెయిడ్ ప్లాన్‌పై 29 రోజుల అదనపు వ్యాలిడిటీ అందిస్తోంది. ప్రస్తుతం ఈ ప్లాన్ వ్యాలిడిటీ 336 రోజులే.
V-EPIQ Cinema Closed : ఏపీలో టికెట్ రేట్ల ఎఫెక్ట్.. బాహుబలి థియేటర్ మూసివేత
కాగా, హ్యాపీ న్యూయర్ ఆఫర్‌లో భాగంగా ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే యూజర్లు అదనంగా 29 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. దీంతో 365 రోజులపాటు వ్యాలిడిటీ యూజర్ల సొంతమవుతుంది. కాగా ఈ ప్లాన్ కేవలం 2022 జనవరి 2 వరకే అందుబాటులో ఉండనుంది.
ఈ ప్లాన్‌తో రీఛార్జి చేసుకున్న వారికి రోజుకు 1.5 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్ లతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకునే సదుపాయం జియో కల్పిస్తోంది.
దీంతో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. దీర్ఘకాలం ప్లాన్ తీసుకోవాలనుకునే వారికి ఈ రీఛార్జి ప్లాన్ ఉపకరిస్తుంది. ప్రస్తుత యూజర్లతో పాటు, కొత్తగా జియో సిమ్ తీసుకున్న వారికి సైతం ఈ ప్లాన్ వర్తిస్తుంది.
