Vaccines For Children : పిల్లలకు వ్యాక్సిన్.. హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లు, వృద్ధులకు బూస్టర్ డోస్

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌.. భారత్ ను భయపెడుతున్న వేళ ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. త్వరలో పిల్లలకు వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించారు. అలాగే హెల్త్‌కేర్‌, ఫ్రంట్‌లైన్‌ వర్కర్

Vaccines For Children : పిల్లలకు వ్యాక్సిన్.. హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లు, వృద్ధులకు బూస్టర్ డోస్

Vaccines For Children

Vaccines For Childen : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌.. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. త్వరలో పిల్లలకు వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించారు. అలాగే హెల్త్‌కేర్‌, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, వృద్ధులకు బూస్టర్‌ డోసు అందిస్తామన్నారు. శనివారం(డిసెంబర్ 25) జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు.

15 నుంచి 18 ఏళ్ల వయసు వారికి జనవరి 3 నుంచి టీకా పంపిణీ ప్రారంభిస్తామని ప్రధాని చెప్పారు. అలాగే జనవరి 10వ తేదీ నుంచి హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు బూస్టర్ డోసు పంపిణీ చేస్తామన్నారు. వీరితో పాటు అదే రోజు నుంచి 60ఏళ్లు పైబడి అనారోగ్య సమస్యలతో ఉన్న వృద్ధులకు (డాక్టర్ల సలహా మేరకు) కూడా అదనపు డోసు పంపిణీ చేస్తామని వెల్లడించారు.

Omicron : ఒమిక్రాన్‌పై బిగ్ రిలీఫ్.. 90శాతం మందిలో లక్షణాలే లేవు, చికిత్స కూడా అవసరం లేదు

‘‘దేశంలో 90 శాతం వయోజనులకు కొవిడ్ టీకా తొలి డోసు పంపిణీ పూర్తయింది. ఒమిక్రాన్‌పై రకరకాల వార్తలు, వదంతులు వస్తున్నాయి. వ్యాక్సిన్‌ తయారీ, పంపిణీ కోసం నిరంతరం పనిచేస్తున్నాం. ఆరోగ్య కార్యకర్తల అంకితభావం వల్లే టీకా పంపిణీ వడివడిగా సాగుతోంది. రానున్న రోజుల్లో వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేస్తాం’’ అని మోదీ అన్నారు.

‘‘దేశంలో కరోనా ఇంకా పూర్తిగా నిర్మూలన కాలేదు. ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న వేళ అందరం అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది. ఒమిక్రాన్‌ వస్తోంది.. ఎవరూ భయాందోళనకు గురికావొద్దు. కొత్త వేరియంట్‌ వల్ల పలు ప్రపంచ దేశాల్లో ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి. మన దేశంలో కూడా కొన్ని కేసులు వచ్చాయి.

ఎవరూ భయాందోళనకు గురికావొద్దు. మాస్కులు, శానిటైజర్లు నిత్యం వాడండి. అప్రమత్తంగా ఉండండి. ఈరోజు దేశంలో 18లక్షల ఐసోలేషన్‌ బెడ్లు, 5 లక్షల ఆక్సిజన్‌ సపోర్టెడ్‌ బెడ్స్, 1.4లక్షల ఐసీయూ బెడ్లు, చిన్నారులకు 90వేల ప్రత్యేక బెడ్‌లు సిద్ధంగా ఉన్నాయి. అలాగే, 3వేలకు పైగా పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్లు, నాలుగు లక్షల ఆక్సిజన్‌ సిలిండర్లు అన్ని రాష్ట్రాలకు సమకూర్చాం. దేశంలో ఔషధాలకు ఎలాంటి కొరతా లేదు’’ అని ప్రధాని చెప్పారు.

V-EPIQ Cinema Closed : ఏపీలో టికెట్ రేట్ల ఎఫెక్ట్.. బాహుబలి థియేటర్ మూసివేత

‘‘ఒమిక్రాన్‌ నివారణకు టీకాలు, జాగ్రత్తలే మందు. అనేక రాష్ట్రాల్లో 100 శాతం కరోనా వ్యాక్సినేషన్‌ పూర్తయింది. వైద్య సిబ్బంది కఠోర శ్రమవల్లే 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయింది. 11 నెలలుగా దేశంలో వ్యాక్సినేషన్‌ ఉద్యమం కొనసాగుతోంది. కొత్త సంవత్సరం కోసం అంతా ఆతృతతో ఎదురుచూస్తున్నాం.. కానీ ఇది అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించడం మరిచిపోవద్దు’’ అని ప్రధాని అన్నారు.