Omicron : ఒమిక్రాన్‌పై బిగ్ రిలీఫ్.. 90శాతం మందిలో లక్షణాలే లేవు, చికిత్స కూడా అవసరం లేదు

ఒమిక్రాన్ సోకిన వారిలో దాదాపు 90శాతం మందిలో ఎలాంటి లక్షణాలు లేవన్నారు. అంతేకాదు వారికి చికిత్స కూడా అందించాల్సిన అవసరం లేదన్నారు.

Omicron : ఒమిక్రాన్‌పై బిగ్ రిలీఫ్.. 90శాతం మందిలో లక్షణాలే లేవు, చికిత్స కూడా అవసరం లేదు

Omicron Cases In Country

Omicron : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తొలుత ఈ వేరియంట్ దక్షిణాఫ్రికాలో వెలుగుచూసింది. స్వల్ప వ్యవధిలోనే ప్రపంచాన్ని చుట్టేస్తోంది. కొన్ని దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కాగా, ఒమిక్రాన్ వేరియంట్ గురించి ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. దీనిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఒమిక్రాన్ బాధితులకు ఎలాంటి చికిత్స అందించాలి? వారికి ఎలాంటి మందులు ఇవ్వాలి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. దీంతో అంతా ఆందోళన చెందుతున్నారు.

V-EPIQ Cinema Closed : ఏపీలో టికెట్ రేట్ల ఎఫెక్ట్.. బాహుబలి థియేటర్ మూసివేత

ఇలాంటి పరిస్థితుల్లో ఒమిక్రాన్ పై ఊరటనిచ్చే విషయం చెప్పారు ఢిల్లీకి చెందిన వైద్య నిపుణులు. ఇప్పటివరకు మన దేశంలో ఒమిక్రాన్ సోకిన వారిలో దాదాపు 90శాతం మందిలో ఎలాంటి లక్షణాలు లేవన్నారు. అంతేకాదు వారికి చికిత్స కూడా అందించాల్సిన అవసరం లేదని ఢిల్లీలోని లోక్ నాయక్ ఆసుపత్రి డాక్టర్ సురేష్ తెలిపారు. ఒమిక్రాన్ బారిన పడ్డా త్వరగానే కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతున్నారని చెప్పారు. కాగా, ఇప్పటివరకు దేశంలో 415 ఒమిక్రాన్ కేసులు వచ్చాయి.

Warm Water : గోరు వెచ్చని నీళ్లు తాగితే మేలే..!

లోక్ నాయక్ ఆసుపత్రిలో 40మంది ఒమిక్రాన్ బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇప్పటికే 19మంది కోలుకుని డిశ్చార్జి కూడా అయ్యారు. వీరిలో 90శాతం మందిలో ఎలాంటి లక్షణాలు లేవని డాక్టర్ సురేష్ తెలిపారు. కొందరిలో మాత్రం స్వల్ప లక్షణాలు (గొంతు మంట, స్వల్ప జ్వరం, ఒళ్లు నొప్పులు) కనిపించాయన్నారు. ఒమిక్రాన్ బాధితులకు చికిత్సలో భాగంగా మల్టీ విటమిన్, పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ మాత్రమే ఇచ్చినట్లు సీనియర్ డాక్టర్ ఒకరు తెలిపారు. ఒమిక్రాన్ రోగులకు అంతకుమించి వేరే మందులు ఇవ్వాల్సిన అవసరం లేదని తాము అనుకుంటున్నామని చెప్పారు. కాగా, ఎయిర్ పోర్టులో కరోనా నిర్ధారణ అయిన వారంతా విదేశాల నుంచి వచ్చిన వారేనని, వారిలో చాలామంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారే ఉన్నారని చెప్పారు. అంతేకాదు వారిలో కొందరు బూస్టర్ డోసు తీసుకున్న వారూ ఉన్నారని తెలిపారు.