Warm Water : గోరువెచ్చని నీళ్లు తాగితే మేలే!

నెలసరి సమయంలో కడుపునొప్పి, నడుం నొప్పి బాధిస్తున్నప్పుడు గోరువెచ్చని నీళ్లు తాగితే సమస్య తగ్గుముఖం పడుతుంది. ఉదయం పూట తాగడం వల్ల జీవక్రియల రేటు వృద్ధి చెందుతుంది.

Warm Water : గోరువెచ్చని నీళ్లు తాగితే మేలే!

Hot Water

Warm Water : మనిషి శరీరానికి నీరు ఎంతో అవసరం. చాలా మంది ఫ్రిజ్లో ఉంచిన చల్లటి నీళ్లు తాగడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే చల్లటి నీళ్లు తాగడం కంటే గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒకప్పుడు ఎవరు కూడా గోరువెచ్చని నీళ్ళు తాగడానికి అంతగా ఆసక్తి చూపేవారు కాదు. కానీ, ఇపుడు గోరువెచ్చని నీరు బరువు తగ్గించడంలో పనికొస్తుందని నిపుణులు చెబుతున్నారు.

రోజులో ఎన్నిగ్లాసుల నీళ్లు తాగితే అంత మంచిది. అయితే ఓ గ్లాసు వేడినీళ్లు కూడా ప్రతి రోజూ తీసుకుంటే మరింత మంచిదంటున్నారు వైద్య నిపుణులు. రోజూ ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికెంతో మేలు జరుగుతుంది. ఉదయం లేవగానే చాలామంది గోరువెచ్చని నీళ్లు తాగుతారు. నిజానికి భోంచేశాక తాగడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది. అరుగుదలలో ఇబ్బందులుండవు. శరీరంలో రక్తప్రసరణ బాగుంటుంది. మలబద్దకం సమస్య దూరమవుతుంది. చిన్నారులకు కూడా వేడీనీళ్లు తాగే అలవాటు చేయడం మంచిది. చురుగ్గా ఉంటారు.

శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయినప్పుడు రకరకాల సమస్యలు బాధిస్తాయి. గోరువెచ్చని నీళ్లు తాగడంతో ఈ వ్యర్థాలను దూరం చేసుకోవచ్చు. చర్మ సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి. రోజూ మనం తీసుకునే ఈ గ్లాసు వేడినీళ్లలో నాలుగైదు చుక్కల నిమ్మరసం కలపడం వల్ల చర్మానికి కొత్త కళ వస్తుంది. శ్వాస, గొంతు సంబంధిత సమస్యలు బాధ పెడుతున్నప్పుడు వేణ్నీళ్లు తాగాలి. దానితో హాని చేసే ఇన్ ఫెక్షన్లు నశిస్తాయి. తెమడ కూడా త్వరగా బయటికొచ్చి ఉపశమనం లభిస్తుంది. మెటబాలిజం పెరిగి ఒంట్లో ఉన్న కొవ్వు కరిగిపోతుంది. దీంతో ఇక బరువు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల ముక్కు గొంతు లో ఉండే శ్లేష్మం పూర్తిగా కరిగి పోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక శీతాకాలంలో శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడేవారు గోరు వెచ్చని నీళ్లు తాగితే ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చంట. అజీర్ణంతో ఇబ్బంది పడుతున్న వారు గోరు వెచ్చని నీటిని తాగితే ఉపశమనం లభిస్తుందట.

నెలసరి సమయంలో కడుపునొప్పి, నడుం నొప్పి బాధిస్తున్నప్పుడు గోరువెచ్చని నీళ్లు తాగితే సమస్య తగ్గుముఖం పడుతుంది. ఉదయం పూట తాగడం వల్ల జీవక్రియల రేటు వృద్ధి చెందుతుంది. రాత్రి పడుకునే ముందు తాగితే హాయిగా నిద్రపడుతుంది. డయాబెటిస్ ముప్పు ఉందని భయపడే వాళ్లకి కూడా ఇది మంచి ఔషధం. ఏ వైరస్ అయినా బ్యాక్టీరియా అయినా వేడి నీళ్ల తో తరిమేయ వచ్చు. వేడి నీళ్లు ఎప్పుడు తాగినా మంచిదే. కానీ ఉదయం నిద్ర లేవ గానే కాలకృత్యాలు తీర్చుకోక ముందే రెండు లేదా మూడు గ్లాసులు గోరు వెచ్చని నీళ్లు తాగండి. తాగేయమన్నారు కదా అని నీటిని గడగడా తాగకండి. నీటిని నోట్లోనే ఉంచుకుంటూ గుటకలు వేస్తూ తాగండి. ఇలా చేయడం మంచిది. మీరు క్రమం తప్పకుండా ప్రతి రోజు ఈ పద్ధతిని కనుక అనుసరించారు అంటే మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి ప్రతి రోజు తప్పకుండా దీన్ని అనుసరించండి.

ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు తీసుకుంటే మలబద్ధకం సమస్య దూరమవుతుంది. గోరువెచ్చని నీళ్లలో నిమ్మకాయని పిండి తాగితే మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ నీళ్లు గుండె సంబంధిత సమస్యలను దూరం చేయడంతో పాటు… గ్లూకోజ్ లెవెల్స్ ను అదుపులోకి తెస్తాయి.