Justice BR Gavai,
Justice BR Gavai: సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ (బీఆర్ గవాయ్) ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గవాయ్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.
బీఆర్ గవాయ్ మహారాష్ట్రలోని అమరావతిలో 1960 నవంబర్ 24న జన్మించారు. 1985 మార్చి 16న న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ దేశ సర్వోన్నత న్యాయస్థానం 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది నవంబరు 23వ తేదీ వరకు గవాయ్ ఈ పదవిలో కొనసాగుతారు. ఇదిలాఉంటే.. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తరువాత దేశ న్యాయవ్యవస్థ అత్యున్నత పీఠాన్ని అధిష్టించిన రెండో దళిత వ్యక్తిగా గవాయ్ చరిత్రపుటలకెక్కారు.
2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జస్టిస్ గవాయ్.. గత ఆరేళ్లలో సుమారు 700 ధర్మాసనాల్లో భాగస్వామ్యం పంచుకొని రాజ్యాంగ, పరిపాలన, సివిల్, క్రిమినల్ చట్టాలు, వాణిజ్య వివాదాలు, ఆర్బిట్రేషన్, విద్యుత్తు, విద్య, పర్యావరణానికి సంబంధించిన కేసులను విచారించారు.
#WATCH | Delhi: President Droupadi Murmu administers oath of office to Justice BR Gavai as the Chief Justice of India (CJI).
(Video Source: President of India/social media) pic.twitter.com/3J9xMbz3kw
— ANI (@ANI) May 14, 2025