Mizoram New Governor : మిజోరాం అభివృద్ధికి కృషి చేస్తా : కంభంపాటి హరిబాబు
మిజోరం రాష్ట్రానికి గవర్నర్ గా నియమించారనే వార్తపై ఏపీకి చెందిన బీజేపీ నేత కంభంపాటి హరిబాబు సంతోషం వ్యక్తంచేశారు. మిజోరం రాష్ట్రానికి గవర్నర్ గా నియమించటం చాలా సంతోషంగా ఉందని..తనకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మిజోరాం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

Kambhampati Hari Babu
Mizoram New Governor : మిజోరం రాష్ట్రానికి గవర్నర్ గా నియామకంపై ఏపీకి చెందిన బీజేపీ నేత కంభంపాటి హరిబాబు సంతోషం వ్యక్తంచేశారు. మిజోరం రాష్ట్రానికి గవర్నర్ గా నియమించటం చాలా సంతోషంగా ఉందని..తనకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మిజోరాం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. చిత్తశుద్దితో పనిచేస్తే మంచి అవకాశాలు వస్తాయని దానికి ఉదాహరణ తననే అన్నారు.
కాగా..రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ ఎనిమిది రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంట్లో భాగగా ఏపీకి చెందిన బీజేపీ నేత..మాజీ లోక్ సభ సభ్యుడు అయిన కంభంపాటి హరిబాబును మిజోరాం రాష్ట్రానికి గవర్నర్ గా ప్రకటించారు. హర్యానా గవర్నర్ గా బండారు దత్తాత్రేయ, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, మధ్యప్రదేశ్ కు మంగూభాయ్ ఛగన్ భాయ్ పటేల్, కర్నాటకకు థావర్ చంద్ గెహ్లాట్,గోవా గవర్నర్‌గా శ్రీధరన్ పిళ్లై (మిజోరాం ప్రస్తుత గవర్నర్), హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా రాజేంద్రన్ విశ్వనాథ్ లను రామ్ నాథ్ కోవింద్ ప్రకటించారు.
కాగా..ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ కేంద్రమంత్రి, ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న బండారు దత్తాత్రేయను హర్యానా రాష్ట్రానికి గవర్నర్‌గాను..అలాగే మాజీ ఎంపీ, ఏపీ బీజేపీ అధ్యక్షునిగా పనిచేసిన తెలుగు బీజేపీ నేత కంభంపాటి హరిబాబును కూడా గవర్నర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.