Uttar Pradesh: ఎస్బీఐ బ్యాంకుకు కన్నం.. పది అడుగుల సొరంగం తవ్వి.. రూ.కోటి విలువైన బంగారం అపహరణ

బ్యాంకు పక్కనున్న ఖాళీ స్థలంలో సొరంగం తవ్వి బ్యాంకులోకి ప్రవేశించారు దొంగలు. అనంతరం బ్యాంకులో ఉన్న రూ.కోటి విలువైన బంగారం ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్, కాన్పూర్‌లో జరిగింది.

Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్‌లో దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. బ్యాంకులోకి సొరంగం ద్వారా ప్రవేశించి రూ.కోటి విలువైన బంగారం ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్, కాన్పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాన్పూర్, భానూతి బ్రాంచ్ ఎస్బీఐ బ్యాంకులో ఈ చోరీ జరిగింది.

Chanda Kochhar: అక్రమ రుణ మంజూరు కేసులో ఐసీఐసీఐ మాజీ సీఈవో చందా కొచ్చర్ దంపతుల అరెస్ట్

బ్యాంకు పక్కనున్న ఖాళీ స్థలం నుంచి దొంగలు బ్యాంకులోకి ఒక సొరంగం తవ్వారు. దాదాపు పది అడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పుగల సొరంగం తవ్వి, ఈ సొరంగం ద్వారా బ్యాంక్ ఫ్లోర్ పగులగొట్టి, బ్యాంకులోకి ప్రవేశించారు. అనంతరం బ్యాంకులోని రూ.1 కోటి విలువైన 1.8 కేజీల బంగారం ఎత్తుకెళ్లారు. అలాగే రూ.32 లక్షల క్యాష్ ఉన్న లాకర్ పగలగొట్టేందుకు కూడా ప్రయత్నించారు. కానీ, ఇది సాధ్యం కాలేదు. ఈ దొంగతనం గురువారం అర్ధరాత్రి తర్వాత జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. శుక్రవారం ఉదయం సిబ్బంది బ్యాంకుకు వచ్చి చూసే సరికి దొంగతనం జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కాగా బ్యాంకులో ఎంత బంగారం చోరీకి గురైంది, దాని విలువెంత అని తెలుసుకోవడానికి సిబ్బందికి గంటలకొద్దీ సమయం పట్టింది.

Group 4 Jobs: నిలిచిపోయిన గ్రూప్-4 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ.. అభ్యర్థుల్లో అయోమయం

చోరీకి గురైన బంగారం 29 మంది కస్టమర్లకు సంబంధించింది అని, బంగారం తాకట్టుపెట్టి రుణాలు తీసుకున్నారని బ్యాంక్ మేనేజర్ తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా, బ్యాంకు గురించి పూర్తిగా తెలిసినటువంటి వాళ్లే ఈ చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు, స్ట్రాంగ్ రూమ్ నుంచి సేకరించిన వేలి ముద్రల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు. బ్యాంకు నిర్మాణం, డిజైన్ గురించి తెలిసిన వాళ్లే ఈ దోపిడీకి పాల్పడే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. త్వరలోనే నిందితుల్ని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.