UP Govt : కరోనా ఉధృతి వేళ..కన్వర్ యాత్రకు అనుమతి, స్పందించిన సుప్రీం

కోవిడ్‌ ఉధృతి మధ్య కన్వర్‌ యాత్రకు ఎలా అనుమతి ఇస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. యోగీ ప్రభుత్వం స్పందన తెలియజేయాలని కోర్టు ఆదేశించింది. హిందూ క్యాలెండర్‌ ప్రకారం సావన్‌ నెలలో శివ భక్తులు కన్వర్‌ యాత్ర చేపట్టి గంగా తీరంలోని శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు.

UP Govt : కరోనా ఉధృతి వేళ..కన్వర్ యాత్రకు అనుమతి, స్పందించిన సుప్రీం

Up

Updated On : July 14, 2021 / 1:02 PM IST

Kanwar Yatra :  కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్న సమయంలో కన్వర్‌ యాత్రకు యూపీ సర్కార్‌ అనుమతి ఇవ్వడం వివాదాస్పదంగా మారుతోంది. ఈనెల 25 నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. దీనిపై సీఎం యోగీ ఆధిత్యనాథ్‌ ఆదేశాలు జారీ చేశారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఇంకా తగ్గుముఖం పట్టకుండానే..ఈ యాత్రకు అనుమతినివ్వడం వివాదాస్పదమౌతోంది. అయితే…కన్వర్ యాత్ర..కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించాలని సీఎం ఆదేశించారు.

Read More :  Weight Loss: ఎక్సర్‌సైజ్.. వర్కౌట్లు చేయకుండానే బరువు తగ్గించుకోవచ్చు..

దీనిపై సుప్రీంకోర్టు స్పందించింది. కోవిడ్‌ ఉధృతి మధ్య కన్వర్‌ యాత్రకు ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించింది. యోగీ ప్రభుత్వం స్పందన తెలియజేయాలని కోర్టు ఆదేశించింది.
హిందూ క్యాలెండర్‌ ప్రకారం సావన్‌ నెలలో శివ భక్తులు కన్వర్‌ యాత్ర చేపట్టి గంగా తీరంలోని శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో హరిద్వార్ నుంచి సావన్ నెలలో చేపట్టాల్సిన కన్వర్ యాత్రను ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. కానీ యోగీ సర్కార్‌ మాత్రం వెనక్కి తగ్గలేదు. కన్వర్‌ యాత్రను జరిపేందుకే మొగ్గు చూపింది. ఈ విషయంలో సుప్రీం జోక్యం చేసుకోవడంతో కన్వర్‌ యాత్ర జరుగుతుందా? లేదా ? అన్నదానిపై సందిగ్ధత నెలకొంది.

Read More :  New IT Rules : రూల్స్ రచ్చ..కోర్టులు ఏం చెబుతాయి ?