Kanyakumari Sea water : తమిళనాడులోని కన్యాకుమారి తీరంలో సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్లింది. ఉదయం సముద్ర మట్టం బాగానే ఉన్నా సాయంత్రం సమయానికి సముద్రం వెనక్కి వెళ్లిపోయింది. రాత్రంతా అలానే ఉందంట.. తీరా ఉదయం చూసేసరికి వెనక్కి వెళ్లిన సముద్రం యథాస్థితికి చేరుకుంది. మరుసటి రోజు రాత్రి కూడా మళ్లీ సముద్ర మట్టం తగ్గిపోయింది. నీళ్లు వెనక్కి వెళ్లిన సమయంలో తీరంలోని వివేకానంద మండపం దగ్గర రాళ్ల గుట్టలు కనిపించాయి.
2004లోనూ సునామీ రావడానికి ముందు ఇలాగే సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్లిందంట.. సాధారణంగా అరుదుగా అమవాస్య, పౌర్ణమి రోజుల్లోనే ఇలా జరుగుతుంటుందని అంటున్నారు. ఏది ఏమైనా తమిళనాడులోని కన్యకుమారి తీరంలో రెండు రోజులుగా సముద్రమట్టంలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.
ఇలా జరగడం వెనుక మళ్లీ ఏమైనా ప్రళయం సంభవించబోతుందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. హిందు మహా సముద్రం, బంగాళాఖాతం, అరేబియా మహాసముద్రం కలిసే ప్రాంతాన్ని త్రికడలి సంగమంగా పిలుస్తుంటారు. ఇదే ప్రాంతంలో సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్లడంతో కాస్తా ఆందోళన కలిగిస్తోంది. ఏ క్షణంలో ఏ ప్రళయం ముంచుకుస్తోందనన్న భయాందోళన కూడా కనిపిస్తోంది..