అడిగిన డబ్బులు ఇవ్వలేదని, తండ్రిని చంపడానికి రూ.10 లక్షల సుపారీ ఇచ్చాడు

కర్ణాటకలోని ఎమ్వీ నగర్‌లో 26ఏళ్ల కొడుకు తండ్రినే హతమార్చాడు. 52 సంవత్సరాల వయస్సున్న వ్యక్తి కొడుకుకు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించాడు. దాంతో తండ్రినే చంపి గ్రామశివార్లలో మృతదేహాన్ని పడేశాడు. ఫైనాన్షియల్ హెల్ప్ చేయలేదని కొడుకే చంపాలని ప్లాన్ చేశాడు. బాధితుడ్ని పన్నీర్ సెల్వంగా గుర్తించారు.
శుక్రవారం ఉదయం గుడికి వెళ్తానని చెప్పిన వ్యక్తి కనిపించకుండాపోయాడు. అదే రోజు సాయంత్రం అతని భార్య పీ రాణి పోలీసులను కలిసి కంప్లైంట్ చేసింది. ప్రాథమిక విచారణ అనంతరం.. చనిపోయిన వ్యక్తిపై మార్చిలోనే పెద్దకొడుకు రాజేశ్ కుమార్ స్నేహితులు దాడి చేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఆ తర్వాత రాజేశ్ తండ్రిని హత్య చేసేందుకు కూడా ప్రయత్నించాడు.
శుక్రవారం సాయంత్రం మేం రాజేశ్ ను ప్రశ్నించాం. అతని నుంచి ఎట్టకేలకు సమాచారం రాబట్టాం. అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్డీ శరణప్ప తెలిపారు. తన తండ్రిని చంపడానికి రాజేశ్ రూ.10లక్షలు ఇచ్చి పురమాయించాడు. అందులో అడ్వాన్స్ కింద రూ.3లక్షలు ఇచ్చేశాడు కూడా.
ప్రతి రోజు ఉదయం బాధితుడు గుడికి వెళ్లేవాడు. శుక్రవారం కూడా అలా వెళ్తుండగా అతనికి పాయిజన్ తో కూడిన ఇంజెక్షన్ ఇచ్చారు. దాని ప్రభావంతోనే అతను ఉదయం 8గంటల 30నిమిషాల సమయంలో ప్రాణాలు కోల్పోయాడు. శవాన్ని వేంగల్ గ్రామ శివార్లు అయిన అటవీ ప్రాంతంలో వదిలేసినట్లు చెప్పారు.
శవాన్ని గుర్తించిన పోలీసులకు రియల్ ఎస్టేట్ బిజినెస్ లో పెట్టుబడులు పెట్టడానికి రాజేశ్ డబ్బులు అడిగినట్లుగా తెలిసింది. అతని తండ్రిని డబ్బులు ఇవ్వడానికి నిరాకరించాడు. అంతేకాకుండా తండ్రి వేరొకరితో అఫైర్ లో ఉన్నాడనే అనుమానం, ఆమె కోసమే డబ్బులు ఖర్చుపెడుతున్నట్లుగా భావించి నేరానికి పాల్పడ్డాడు.
కే పార్తిబాన్(29), బీ స్టాన్లీ(27), జే ఆనంద్ (29)లను నిందితులుగా గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన వారిని పట్టుకునేపనిలో ఉన్నారు.