Organ Donation
Karnataka: బెంగళూరులోని దొడ్డబల్లాపూర్ లో బస్సు క్లీనర్ గా పనిచేస్తున్న నవీన్ కుమార్ రోడ్ యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడ్డాడు. హాస్పిటల్ కు తీసుకెళ్లి చికిత్స అందిస్తుండగా మూడు రోజుల తర్వాత ప్రాణాలు కోల్పోయాడు. నంది హుబ్లీ దగ్గర్లోని బాలకుంతహల్లీ గ్రామానికి చెందిన నవీన్ పేరెంట్స్ దుఖంలో మునిగిపోయారు. మరణించిన తమ కొడుకు అవయవాలను దానమిచ్చేందుకు ఒప్పుకుని గొప్పదనం చాటుకున్నారు.
ఈ క్రమంలోనే ఆ 24ఏళ్ల వ్యక్తి లివర్, కిడ్నీ, హార్ట్ వాల్వ్, రెటీనాలను దానంగా ఇచ్చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డా. కే సుధాకర్ మూడు ట్వీట్లతో సంతాపంతో పాటు ప్రశంసలు కురిపించారు.
“నంది హుబ్లీ చిక్కబల్లాపూర్ కు చెందిన నవీన్ కుమార్ బస్ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. గత వారం రోడ్ యాక్సిడెంట్‌కు గురై తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో చేరాడు. మూడు రోజుల క్రితమే ప్రాణాలు కోల్పోయాడు”
Read Also: కర్ణాటక బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఆర్థిక సాయం
“అతని తల్లిదండ్రులు సహృదయంతో కొడుకును కోల్పోయిన బాధలో ఉన్నా అవయవదానం చేసేందుకు ముందుకొచ్చారు. నవీన్ లివర్, కిడ్నీ, హార్ట్ వాల్వ్, రెటీనాలతో మరొకరికి ప్రాణదానం చేయగలం. గత 15రోజుల్లో విక్టోరియా హాస్పిటల్ లో జరిగిన రెండో అవయవ మార్పిడి ఇది. విటాలిటీ టీంకు కంగ్రాచ్యులేషన్స్” అని మంత్రి పేర్కొన్నారు.
ದೊಡ್ಡಬಳ್ಳಾಪುರದ ಕಾಲೇಜೊಂದರಲ್ಲಿ ಬಸ್ ಕ್ಲೀನರ್ ಆಗಿ ಕೆಲಸ ಮಾಡುತ್ತಿದ್ದ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರದ ನಂದಿ ಹೋಬಳಿಯ ಬಾಲಕುಂಟಹಳ್ಳಿ ಗ್ರಾಮದ 24 ವರ್ಷ ವಯಸ್ಸಿನ ನವೀನ್ ಕುಮಾರ್ ಕಳೆದ ವಾರ ರಸ್ತೆ ಅಪಘಾತದಲ್ಲಿ ತೀವ್ರವಾಗಿ ಗಾಯಗೊಂಡು 3 ದಿನಗಳ ನಂತರ ಅಸುನೀಗಿದ್ದ.@DHFWKA
1/3 pic.twitter.com/mX7wkhc3BI— Dr Sudhakar K (@mla_sudhakar) July 11, 2022