Karnataka Bus: కర్ణాటక బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఆర్థిక సాయం

విహార యాత్రకు వెళ్లి తిరిగొచ్చే క్రమంలో జరిగిన ప్రమాద బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించింది రాష్ట్ర ప్రభుత్వం. మసబ్ ట్యాంక్‌లో తన కార్యాలయంలోనే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ప్రభుత్వ ఆర్ధిక సహాయాన్ని అందించారు.

Karnataka Bus: కర్ణాటక బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఆర్థిక సాయం

Karantaka Bus

Karnataka Bus: విహార యాత్రకు వెళ్లి తిరిగొచ్చే క్రమంలో జరిగిన ప్రమాద బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించింది రాష్ట్ర ప్రభుత్వం. మసబ్ ట్యాంక్‌లో తన కార్యాలయంలోనే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ప్రభుత్వ ఆర్ధిక సహాయాన్ని అందించారు. మృతుల కుటుంబాలతో పాటు గాయపడిన వారి కుటుంబ సభ్యులను కూడా ఆదుకున్నారు.

మొత్తం ఏడు కుటుంబాలకు రూ.3లక్షల చొప్పున ఇవ్వగా, గాయపడ్డ వారి కుటుంబాలకు రూ.50వేల చొప్పున చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సాయన్న, కలెక్టర్ శర్మన్, అధికారులు విచ్చేశారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… “కర్ణాటక బస్సుకు జరిగిన ప్రమాద ఘటన చాలా బాధాకరం. కుటుంబాలతో కలిసి విహర యాత్రకు వెళ్లి తిరిగొచ్చే క్రమంలో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం అందరినీ కలచివేసింది. మృతులతో పాటు గాయపడ్డ వారి కుటుంబాలకు సాయం అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తమ వారి కళ్ల ముందే బస్సు కాలిపోవడం హృదయ విచారకరం” అని వెల్లడించారు.

Read Also : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం- 8 మంది హైదరాబాదీలు మృతి