HD Kumaraswamy
HD Kumaraswamy hospitalised : కర్ణాటక (Karnataka)మాజీ సీఎం, జేడీఎస్ (JDS)అగ్రనేత కుమారస్వామి (HD Kumaraswamy )అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. బుధవారం, (ఆగస్టు 30,2023)న ఆయన అస్వస్థతకు గురి కావటంతో హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న కుమారస్వామి గత కొంతకాలంలో రాజకీయ కార్యక్రమాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. వరుసగా పార్టీ సమావేశాల్లో పాల్గొనటంతో అలసిపోయారు. దీంతో ఆయన అస్వస్థతకు గురి అయ్యారు.
కాగా గతంలో కుమారస్వామికి గుండెకు సర్జరీ జరిగింది. ఈ క్రమంలో ఆయన అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కుమారస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు హామీ ఇచ్చారు. కాగా కుమారస్వామి తన కుమారుడు నిఖిల్ కుమారస్వామి (Nikhil Kumaraswamy)హీరోగా చిత్రాన్ని నిర్మించనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.