Karnataka : బ్యాంక్ అధికారులకు దిమ్మతిరిగే షాకిచ్చిన రైతు.. నెటిజన్లు ప్రశంసల వర్షం..
Karnataka : కర్ణాటక రాష్ట్రంలో ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. బ్యాంకు అధికారులకు ఓ రైతు దిమ్మతిరిగే షాకిచ్చాడు.
Karnataka : కర్ణాటక రాష్ట్రంలో గత కొన్ని నెలల క్రితం జరిగిన ఆసక్తికర ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బ్యాంకు అధికారులకు ఓ రైతు దిమ్మతిరిగే షాకిచ్చాడు. సదరు రైతు డిమాండ్‌కు అధికారులు దిగొచ్చారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైతు నిర్ణయం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read : Telangana Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ భూముల యాజమానులకు భారీ ఊరట.. 45రోజుల్లో పరిష్కారంకు చర్యలు
కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లా సకలేశ్పుర ప్రాంతానికి చెందిన చొక్కన గౌడ అనే రైతు ఓ బ్యాంకు నుంచి రూ.50వేలు అప్పుగా తీసుకున్నాడు. అయితే, ఆ రుణాన్ని బ్యాంక్ నిబంధనల ప్రకారం సమయానికి చెల్లించాడు. బ్యాంకులో తన అప్పు పూర్తయిందని రైతు భావించాడు. కొన్ని రోజులకు ఆ రైతుకు బ్యాంక్ నుంచి నోటీసు వచ్చింది.
బ్యాంక్ రుణం పూర్తి స్థాయిలో చెల్లించినప్పటికీ తనకు నోటీసు ఎందుకొచ్చిందని రైతు తొలుత కాస్త కంగారు పడ్డాడు. తరువాత తేరుకొని బ్యాంక్ నుంచి వచ్చిన నోటీసును చూడగా.. రైతు షాక్‌కు గురయ్యాడు. మీ పేరుమీద ఇంకో రూ.9.34 పైసలు బకాయి ఉంది. వాటిని చెల్లించాలంటూ ఆ నోటీసులో పేర్కొన్నారు.
నోటీసు పట్టుకొని రైతు చొక్కన గౌడ బ్యాంక్ వద్దకు వెళ్లారు. ఇదేంటి నేను మొత్తం సొమ్ము చెల్లించా.. మళ్లీ నోటీసు ఎందుకిచ్చారు అంటూ బ్యాంక్ అధికారులను ప్రశ్నించారు. వాళ్లు వివరాలేమీ చెప్పకుండా మీ పేరుపై ఉన్న రూ.9.34 రుణాన్ని చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పారు. దీంతో సదరు రైతు రూ. 10 బ్యాంకుకు చెల్లించాండు. బ్యాంక్ అధికారులు అందుకు సంబంధించిన రిసిప్ట్ ఇచ్చారు. దీంతో రైతు నాకు రావాల్సిన బాకీ ఇవ్వరా అంటూ బ్యాంక్ అధికారులను ప్రశ్నించారు.
నేను బ్యాంక్ కు చెల్లించాల్సింది రూ. 9.34 పైసలు.. నేను చెల్లించింది రూ.10. మిగిలిన 66 పైసలు ఇవ్వాలంటూ రైతు చొక్కన గౌడ బ్యాంక్ అధికారులను డిమాండ్ చేశాడు. దీంతో కంగుతిన్న బ్యాంక్ అధికారులు చేసేది లేక 66 పైసలు తన బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. ఈ ఘటన ఈ ఏడాది ఫిబ్రవరిలో చోటు చేసుకోగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు ‘రైతన్నా.. భలే బుద్ధి చెప్పావు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
