Hijab Row : హిజాబ్ వివాదం.. కర్నాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

కర్నాటకలో చెలరేగిన హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం కర్నాటకలో ఈ వివాదం ప్రకంపనలు రేపుతోంది. తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది.

Hijab Row : కర్నాటకలో చెలరేగిన హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం కర్నాటకలో ఈ వివాదం ప్రకంపనలు రేపుతోంది. తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఈ వివాదంపై కర్నాటక హైకోర్టులో వాడీవేడి వాదనలు సాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో కర్నాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే అన్ని స్కూళ్లు, కాలేజీల్లోనూ మతపరమైన వస్త్రధారణపై నిషేధం విధించింది. కాషాయ శాలువాలు, స్కార్ఫ్స్, హిజాబాద్ లు, మతపరమైన జెండాలు తరగతి గదుల్లోకి తీసుకురావొద్దని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ నిబంధనలు కచ్చితంగా అమలు కావాల్సిందేనని స్పష్టం చేసింది.

Hijab Fight

Hijab Row In AP: ఏపీకి పాకిన హిజాబ్ వివాదం..విద్యార్థినిలను అడ్డుకున్న విజయవాడ లయోల కాలేజీ యాజమాన్యం

జనవరిలో ఉడుపిలోని ప్రభుత్వ కాలేజీలో ఆరుగురు విద్యార్థినిలు హిజాబ్‌ ధరించి హాజరవగా, వారిని కాలేజీలోకి అనుమతించ లేదు. హిజాబ్ తీసివేస్తేనే లోపలికి అనుమతి ఇస్తామని కాలేజీ యాజమాన్యం తేల్చి చెప్పింది. దీనిపై వారు అభ్యంతరం తెలిపారు. హిజాబ్ అనేది తమ సంప్రదాయం అని, హక్కు అని చెప్పారు. ఇంతకాలంగా లేనిది సడెన్ గా ఇప్పుడు ఇటువంటి ఆంక్షలు పెట్టటం సరికాదని వాదినకు దిగారు. కాలేజీ ముందు ఆందోళన చేశారు. అదే సమయంలో హిందూ విద్యార్థులు కాషాయ కండువాలను ధరించి వచ్చారు. అంతే, వ్యవహారం దుమారం రేపింది. ఇలా.. ఇరు వర్గాల మధ్య ప్రారంభమైన వివాదం రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు విస్తరించింది.

Hijab Row : హిజాబ్ ధరించకపోవడం వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయి : కాంగ్రెస్ ఎమ్మెల్యే

ఉడుపిలోని ప్రభుత్వ కాలేజీలో చెలరేగిన హిజాబ్ వివాదం ఇతర స్కూళ్లు, కాలేజీలకూ వ్యాపిస్తోంది. తాజాగా మాండ్యలోని రోటరీ స్కూలుకు హిజాబ్‌ ధరించి వచ్చిన విద్యార్థులను యాజమాన్యం అనుమతించలేదు. కోర్టు ఆదేశాల ప్రకారం హిజాబ్‌ ధరించి వచ్చిన వారికి ప్రవేశం లేదన్నారు. ఈ అంశంపై కొందరు తల్లిదండ్రులకు, టీచర్లకు మధ్య గొడవ జరిగింది. హిజాబ్‌ ధరించి తీరతామన్న వారిని వెనక్కి పంపించేశారు. తొలగించిన వారిని స్కూల్లోకి అనుమతించారు. ఈ విధానాలపై విద్యార్థుల తల్లిదండ్రులు భగ్గుమంటున్నారు.

Hijab Row

Hijab Row : మతపరమైన దుస్తులు వద్దు… హిజాబ్‌ వివాదంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

కర్నాటకను కుదిపేస్తున్న హిజాబ్ వివాదం ఏపీని కూడా తాకింది. కృష్ణా జిల్లా విజయవాడ లోని ప్రముఖ ఆంధ్రా లయోలా కాలేజీలో బుర్ఖా వేసుకొచ్చిన తమను కాలేజీ యాజమాన్యం అడ్డుకుందంటూ విద్యార్ధినులు ఆరోపించడం సంచలనంగా మారింది. విషయం మీడియాలో సోషల్ మీడియాలో వైరల్ కావడం, ముస్లిం మత పెద్దలు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగడంతో ఇష్యూ సీరియస్ గా మారింది. అయితే ఘటనపై జిల్లా కలెక్టర్ జే నివాస్, విజయవాడ పోలీస్ కమిషన్ పాలరాజు స్పందించినట్లు తెలుస్తోంది. కలెక్టర్, సీపీ ఇద్దరూ కాలేజీ ప్రిన్సిపల్ తో నేరుగా మాట్లాడంటంతో వివాదం సద్దుమణిగినట్టు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు