IPS Officer: కెరీర్‌లోనే నాలుగోసారి రాజీనామా చేసిన ఐపీఎస్ ఆఫీసర్

IPS Officer: కెరీర్‌లోనే నాలుగోసారి రాజీనామా చేసిన ఐపీఎస్ ఆఫీసర్

Ips Officer

Updated On : May 11, 2022 / 11:01 AM IST

IPS Officer: వేధింపుల ఆరోపణలు తట్టుకోలేక కెరీర్‌లో నాలుగోసారి పోలీసు ఉద్యోగానికి రాజీనామా సమర్పించారు ఐపీఎస్ అధికారి పీ రవీంద్రనాథ్.

“కర్ణాటక, ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ రవీంద్రనాథ్ ప్రవర్తించిన తీరు నన్ను బాధకు గురి చేసింది. SC & ST రూల్ 8 ప్రకారం.. ప్రొటెక్షన సెల్ ఏర్పాటు కోసం గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ చేయమని అడిగా. అదేమీ పట్టించుకోకుండా నన్ను వేధించడానికే ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా ట్రాన్సఫర్ చేశారు. ఫేక్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ గురించి లీగల్ యాక్షన్ తీసుకున్నప్పటి నుంచి ఇలా జరుగుతుంది” అని రవీంద్రనాథ్ లెటర్ లో పేర్కొన్నారు.

డైరక్టరేట్ ఆఫ్ సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్‌మెంట్ డీజీపీ అయిన రవీంద్రనాథ్.. రీసెంట్ గా కర్ణాటక పోలీస్ ట్రైనింగ్ వింగ్ కు ట్రాన్సఫర్ అయ్యారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి ఈ అధికారి పూర్తి వ్యతిరేకత వ్యక్తం చేశారు.

Read Also: కశ్మీర్ ఫైల్స్ సినిమా మీద ట్వీట్ చేసిన ఐఏఎస్‌కు నోటీసులు

మంగళవారం చీఫె సెక్రటరీ పీ రవికుమార్ కు రాజీనామా సమర్పించడానికి ముందే సోమవారం డీజీపీ ప్రవీణ్ సూద్ ను కలిశారు రవీంద్రనాథ్.

ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన 1989 బ్యాచ్ IPS అధికారి గతంలో కూడా దళం నుండి వైదొలిగారు, కానీ తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. 2014లో, నగరంలోని ఒక కేఫ్‌లో ఒక మహిళ చిత్రాలను క్లిక్ చేసిన కేసులో తనను ఇరికించారని ఆరోపిస్తూ అప్పటి బెంగళూరు నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ పాత్రకు నిరసనగా రవీంద్రనాథ్ రాజీనామా చేశారు.

2008లో, అప్పటి ఎడిజిపి (పరిపాలన)గా ఉన్న సీనియర్ సహోద్యోగి బిఇ ఉమాపతి ఆరోపణపై వ్యతిరేకిస్తూ ఆయన రాజీనామా చేశారు.

ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన 1989 బ్యాచ్ IPS అధికారి గతంలో కూడా రాజీనామా చేశారు. కానీ తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. 2014లో ఇంకోసారి ఒక కేఫ్‌లో ఒక మహిళ చిత్రాలను క్లిక్ చేసిన కేసులో తనను ఇరికించారంటూ ఆరోపిస్తూ బెంగళూరు నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ పాత్రకు నిరసనగా రవీంద్రనాథ్ రాజీనామా చేశారు.

2008లో, అప్పటి ఎడిజిపి (పరిపాలన)గా ఉన్న సీనియర్ సహోద్యోగి ఉమాపతి ఆరోపణపై వ్యతిరేకిస్తూ ఆయన రాజీనామా చేశారు.