Engine Oil And Tea: ఇంజిన్ ఆయిల్, టీ.. 33ఏళ్లుగా ఇదే ఆయన ఆహారం..

బియ్యం లేదా చపాతీకి బదులుగా, అతని రోజువారీ ఆహారంలో 7 నుంచి 8 లీటర్ల వేస్ట్ ఇంజిన్ ఆయిల్, టీ ఉన్నాయి.

Engine Oil And Tea: సాధారణంగా మనుషులు ఎవరైనా ఆహారంగా ఏం తీసుకుంటారు అంటే.. పండ్లు, కూరగాయలు, టిఫిన్స్, రైస్ వగైరా వంటివి తింటారని చెబుతారు. అది కామన్. ప్రతి మనిషి తన ఆకలి తీర్చుకునేందుకు ఏదో ఒక ఆహారం తీసుకుంటాడు. ఇది సర్వ సాధారణం. అయితే ఓ వ్యక్తి ఇందుకు భిన్నంగా ఉన్నాడు. అతడు పండ్లు, కూరగాయలు తినడు. అన్నం జోలికి అసలే పోడు. అతడి ఆహారం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఇంజిన్ ఆయిల్, టీ.. ఇదే అతడి ఆహారం. గత 33 ఏళ్లుగా ఇవే ఆ వ్యక్తి ఆహారం అంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇంజిన్ ఆయిల్, టీ తాగి అతగాడు హ్యాపీగా బతికేస్తున్నాడు.

కర్నాటక రాష్ట్రం శివమొగ్గకు చెందిన వ్యక్తి ఇంజిన్ ఆయిల్, టీ ని ఆహారంగా తీసుకుంటున్నాడు. ఆయిల్ కుమార్ గా అతడు గుర్తింపు పొందాడు. ప్రతి రోజు అతడు 7 నుంచి 8 లీటర్ల వేస్ట్ ఇంజిన్ ఆయిల్ తాగుతాడు. సోషల్ మీడియాలో అతడికి సంబంధించిన వీడియో హల్‌చల్ చేస్తోంది. అతడు లుంగీ ధరించాడు. చూడటానికి సన్యాసిలా ఉన్నాడు. బాటిల్ లో ఉన్న ఇంజిన్ ఆయిల్ తాగుతున్నట్లు ఆ వీడియోలో కనిపించింది. మూడు దశాబ్దాలకు పైగా అతను సాధారణ ఆహారం తీసుకోవడం లేదని, బదులుగా టీ ఇంజిన్ ఆయిల్ తాగి బతికేస్తున్నాడని ఆ వీడియోలో ఉంది.

“గత 33 సంవత్సరాలుగా, శివమొగ్గకు చెందిన ఆయిల్ కుమార్ ఆహారం లేకుండా జీవించడం ద్వారా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. బియ్యం లేదా చపాతీకి బదులుగా, అతని రోజువారీ ఆహారంలో 7 నుంచి 8 లీటర్ల వేస్ట్ ఇంజిన్ ఆయిల్, టీ ఉన్నాయి. ఆహారం తీసుకోకపోయినా.. ఇంజిన్ ఆయిల్, టీ తాగుతున్నా.. అతడు ఆరోగ్యంగా, బలంగా ఉండటం చూసి డాక్టర్లు, సైంటిస్టులు సైతం షాక్ అవుతున్నారు” అని ఆ వీడియోలో ఉంది.

దీనిపై ఆయిల్ కుమార్ స్పందించాడు. అయ్యప్ప ఆశీర్వాదం వల్లే తనకు ఈ ప్రత్యేకమైన జీవనశైలి సాధ్యమైందని చెబుతాడు. ఆయిల్ కుమార్ స్టోరీ కర్ణాటకలోనే కాదు దేశం మొత్తం అత్యంత చర్చనీయాంశమైన వైద్య రహస్యాలలో ఒకటిగా మారింది.

దీనిపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ఆయిల్ కుమార్ చాలా గ్రేట్ అని ఒకరంటే.. ఇంజిన్ ఆయిల్ తాగడం ప్రాణాలకే ప్రమాదకరం అని మరొకరు హెచ్చరించారు. అవయవాలు దెబ్బతింటాయన్నారు. కోమాలోకి వెళ్లడమో, మరణించడమో జరుగుతుందన్నారు.

Also Read: ట్రంప్ గోల్డ్, ప్లాటినమ్ కార్డులు ఏమిటి..? వీటి వల్ల ఉపయోగం ఎవరికి..? ఎంత చెల్లించాలి.. అమెరికాలో ఎన్నిరోజులు ఉండొచ్చు..