Karnataka: మాజీ సీఎం యెడియూరప్ప ఇంటిపై రాళ్ల దాడి.. తీవ్ర ఉద్రిక్తత

కర్ణాటకలో ఎస్సీల రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి రిటైర్డ్ జడ్జి సదాశివ కమిషన్‌ ఇచ్చిన నివేదిక విషయంలో ఆందోళనలు జరుగుతున్నాయి. బంజార, కొరమ, బోవి వంటి వారికి అన్యాయం చేయకూడదని దళిత సంఘాలు నిరసనలు తెలుపుతున్నాయి.

Karnataka

Karnataka: కర్ణాటక బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప (BS Yediyurappa) ఇంటి ముందు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కర్ణాటకలో ఎస్సీల రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి రిటైర్డ్ జడ్జి సదాశివ కమిషన్‌ (Sadashiva Commission) ఇచ్చిన నివేదిక విషయంలో ఆందోళనలు జరుగుతున్నాయి. బంజార, కొరమ, బోవి వంటి వారికి అన్యాయం చేయకూడదని దళిత సంఘాలు నిరసనలు తెలుపుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఇవాళ షిమోగా జిల్లాలోని బీఎస్ యెడియూరప్ప ఇంటి ముందు వారు ఆందోళనలకు దిగి, రాళ్లు రువ్వారు. వందలాది మంది బంజారా నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జి చేశారు.  శివమొగ్గలో నిరసనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి రావడంతో పోలీసులు వారిపై లాఠీ ఝళిపించారు. శివమొగ్గలో పోలీసులు 144 సెక్షన్ విధించారు.

విద్య, ఉద్యోగాల్లో ఎస్సీల రిజర్వేషన్ల విషయంలో కొత్త విధానానికి కేంద్ర సర్కారుకు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం ప్రతిపాదనలు చేయడంతో దళితులు మండిపడుతున్నారు. మరోవైపు, ఓబీసీ కేటరిగి 2బీ నుంచి ముస్లింలను తీసేయాలని కూడా కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడంతో ముస్లింలు కూడా మండిపడుతున్నారు. కర్ణాటకలో ఎన్నికలు జరగాల్సి ఉన్న వేళ ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటుండడం గమనార్హం.

Mahua Moitra: బీజేపీ నేతలపై టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా సంచలన వ్యాఖ్యలు