Mahua Moitra: బీజేపీ నేతలపై టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా సంచలన వ్యాఖ్యలు

భట్‌ దాహోద్ బీజేపీ ఎంపీ జస్వంత్‌సిన్హ్ భభోర్‭కి దోషిగా నిర్ధారణ అయిన రేపిస్ట్ శైలేష్‌ చిమన్‌లాల్‌ (shailesh chimanlal) సోదరుడు. లింఖేడా ఎమ్మెల్యే శైలేష్ భాభోర్‌తో కలిసి నీటి సరఫరా పథకం ప్రారంభోత్సవానికి హాజరయ్యాడు. దీనిపై ఎంపీ మొయిత్రా పాలక బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. దోషులను జైలులో పెట్టాలని ఎంపీ పిలుపునిచ్చారు, గత సంవత్సరం అత్యాచారం చేసిన దోషులు స్వాతంత్ర్య దినోత్సవం రోజున ముందస్తుగా విడుదలయ్యారు.

Mahua Moitra: బీజేపీ నేతలపై టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా సంచలన వ్యాఖ్యలు

Mahua Moitra call bjp leaders as rapists

Updated On : March 27, 2023 / 4:38 PM IST

Mahua Moitra: భారతీయ జనతా పార్టీ మీద తరుచూ తనదైన శైలిలో విమర్శలు గుప్పించే తృణమూల్ కాంగ్రెస్ నేత, ఎంపీ మహువా మోయిత్రా (Trinamool Congress MP Mahua Moitra) మరోసారి మాటల తూటాలు పేల్చారు. బిల్కిస్ బానో (Bilkis Bano case) సామూహిక అత్యాచార నిందితుడితో బీజేపీ ఎంపీ (bjp mp), ఎమ్మెల్యే (mla) వేదిక పంచుకోవడంపై మొయిత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ ఫొటోను మోయిత్రా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘నేను ఈ రాక్షసులను తిరిగి జైలులో చూడాలనుకుంటున్నాను’’ అని ట్వీట్ చేశారు. బిల్కిస్ బానో గ్యాంగ్‌రేప్, హత్య కేసులో 11 మంది దోషుల్లోని ఒక వ్యక్తి.. గుజరాత్‌లో ఇద్దరు భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారని పేర్కొంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా సోమవారం ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.

Rahul Gandhi: రాహుల్ మీద డజనుకు పైగా పరువునష్టం కేసులు.. తనను ఎన్నన్నా ఎవరినీ నొప్పించని రాహుల్