Rahul Gandhi: రాహుల్ మీద డజనుకు పైగా పరువునష్టం కేసులు.. తనను ఎన్నన్నా ఎవరినీ నొప్పించని రాహుల్

అయితే రాహుల్ మాత్రం ఎవరి మీద ఇలాంటి పరువు నష్టం కేసులు నమోదు చేయలేదు. ఆయనను ‘పప్పు’ అనడమే కాకుండా.. ఆయనపైనా, ఆయన కుటుంబ సభ్యులపైనా అనేక రాజకీయ విమర్శలు చేసినప్పటికీ ఆయన మాత్రం ఎవరిపైనా కేసు పెట్టలేదు.

Rahul Gandhi: రాహుల్ మీద డజనుకు పైగా పరువునష్టం కేసులు.. తనను ఎన్నన్నా ఎవరినీ నొప్పించని రాహుల్

More than a dozen defamation cases against Rahul

Rahul Gandhi: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ (Rahul Gandhi) రెండేళ్ల జైలు శిక్షతో పాటు ఎంపీ పదవి కోల్పోయిన అనంతరం దేశ వ్యాప్తంగా ఆయన మీద వేసిన పరువు నష్టం కేసులు (defamation cases) ఒక్కసారిగా చర్చలోకి వచ్చాయి. రాహుల్‌ తరఫున ఓ కేసులో వాదనలు వినిపిస్తున్న న్యాయవాది కౌశల్‌ మోర్‌ (kaushal mour) అందించిన సమాచారం ప్రకారం రాహుల్ మీద దేశంలో డజనుకుపైగా క్రిమినల్‌ పరువు నష్టం కేసులు దాఖలయ్యాయి. వివిధ సందర్భాల్లో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఇవి నమోదు అయ్యాయి. అయితే రాహుల్ మాత్రం ఎవరి మీద ఇలాంటి పరువు నష్టం కేసులు నమోదు చేయలేదు. ఆయనను ‘పప్పు’ అనడమే కాకుండా.. ఆయనపైనా, ఆయన కుటుంబ సభ్యులపైనా అనేక రాజకీయ విమర్శలు చేసినప్పటికీ ఆయన మాత్రం ఎవరిపైనా కేసు పెట్టలేదు.

Black Protest: కాంగ్రెస్ పార్టీ నిరసనలో సడెన్ ఎంట్రీ ఇచ్చిన తృణమూల్ కాంగ్రెస్

కానీ ఆర్‌ఎస్ఎస్‌(rss), ప్రధాని మోదీ (pm modi), హోం మంత్రి అమిత్‌ షా (amit shah)లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాహుల్‌పై కేసులు నమోదయ్యాయి. ‘‘దొంగలందరికీ మోదీ అనే ఇంటి పేరు ఎందుకుంది?’’ అన్న వ్యాఖ్యపై మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో ఒక్క సూరత్‌ కోర్టు మాత్రమే తీర్పు వెలువరించింది. 2014లో ఠాణేలో జరిగిన సభలో ప్రసంగించిన రాహుల్‌… గాంధీజీ (gandhi)ని ఆరెస్సెస్‌ వారు హత్య చేశారని ప్రశ్నించారు. అయితే రాహుల్ తప్పుడు ఆరోపణ చేశారని భివండీకి చెందిన ఆ సంస్థ నాయకుడు కేసు పెట్టారు.

Sanjay Raut: సావర్కర్ మీద సవాళ్లు వద్దంటూ రాహుల్‭ను కలవనున్న రౌత్

రాఫేల్‌ (rafeal) యుద్ధ విమానాల వ్యవహారాల సమయంలో మోదీని ఉద్దేశించి ‘కమాండర్‌ ఇన్‌ తీఫ్‌’ అని విమర్శించారంటూ బీజేపీ నాయకుడు ఒకరు గిర్‌గాంలో కేసు పెట్టారు. ఈ కేసు పెండింగ్‌లో ఉంది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో 2019 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల సభలో ప్రసంగించిన రాహుల్‌.. ‘‘హత్య కేసులో నిందితుడైన అమిత్‌ షా.. బీజేపీ అధ్యక్షునిగా ఉన్నారు’’ అని వ్యాఖ్యానించారు. దీనిపై అహ్మదాబాద్‌ కోర్టులో బీజేపీ కార్పొరేటర్‌ ఒకరు కేసు పెట్టారు. భారత్‌ జోడో యాత్ర సందర్భంగా మహారాష్ట్రలో ప్రసంగించిన రాహుల్‌ ‘‘సావర్కర్‌ బ్రిటిషు వారిని క్షమాపణలు కోరారు’’ అని అన్నారు. దీనిపై సావర్కర్‌ మనుమడు వినాయక్‌ సావర్కర్‌, శివసేన అధినేత షిండే (eknat shinde) (ప్రస్తుత ముఖ్యంత్రి) వేరువేరుగా రెండు దావాలు వేశారు.