అలా జరిగితే కేఫ్‌లో బాంబు పేలుడు తీవ్రత మరింత అధికంగా ఉండేది.. మరణాలు సంభవించేవి: కర్ణాటక హోంమంత్రి

Rameshwaram Cafe: బ్యాటరీ, టైమర్, ఇతర పరికరాలను రూపొందించిన తీరు..

అలా జరిగితే కేఫ్‌లో బాంబు పేలుడు తీవ్రత మరింత అధికంగా ఉండేది.. మరణాలు సంభవించేవి: కర్ణాటక హోంమంత్రి

Bengaluru Rameshwaram Cafe

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు బ్లాస్ట్ జరిగి తొమ్మిది మంది గాయపడ్డ ఘటనపై కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర ఇవాళ పలు వివరాలు తెలిపారు. ఐఈడీ పేలుడు సంభవించిన ప్రాంతాన్ని తాను కూడా సందర్శించానని అన్నారు.

అక్కడ బోల్టులు, నెయిల్స్ చూశానని జి పరమేశ్వర తెలిపారు. ఐఈడీ పేలుడుతో అవి అన్నీ పై దిశగా వెళ్లాయని, ఒకవేళ అడ్డంగా వెళ్తే కేఫ్‌లోని మరింత మందికి గాయాలయ్యేవని వివరించారు. దాంతో మరణాలు కూడా సంభవించేవని చెప్పారు. బోల్టులు, నెయిల్స్ అదృష్టవశాత్తూ అడ్డ దిశలో వెళ్లలేదన్నారు.

అవి అడ్డంగా వెళ్తే పేలుడు తీవ్రత మరింత ఎక్కువగా ఉండేదని వివరించారు. ఐఈడీని వాడిన విధానాన్ని బట్టి రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడికి, గతంలో జరిగిన మంగళూరు పేలుడుకి సంబంధం ఉన్నట్లు తెలుస్తోందని చెప్పారు. బ్యాటరీ, టైమర్, ఇతర పరికరాలను రూపొందించిన తీరు మంగళూరు పేలుడులో వాడిన ఐఈడీని గుర్తుకు తెస్తుందని తెలిపారు.

బాంబు పేలుడును రాజకీయం చేయొద్దని బీజేపీ నేతలను ఆయన కోరారు. బాంబు పేలుడు ఘటనపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. పేలుడుకు సంబంధించి కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. వాటి ఆధారంగా అధికారులు విచారణ జరుపుతున్నారు.

Rohit Sharma : క్రికెట్ అభిమానుల‌కు షాక్‌.. మాజీ క్రికెట‌ర్ రోహిత్ శ‌ర్మ క‌న్నుమూత‌