School Teacher: నిన్నెవడూ కాపాడలేడంటూ.. స్కూల్ బాలికకు బలవంతంగా కేక్ రుద్దిన టీచర్ అరెస్ట్
ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌లో స్కూల్ టీచర్ తన స్టూడెంట్ పై వికృత చేష్టలకు తెగబడ్డాడు. వద్దని గింజుకుంటున్న బలవంతంగా పట్టుకుని..

Pocso Act
School Teacher: ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌లో స్కూల్ టీచర్ తన స్టూడెంట్ పై వికృత చేష్టలకు తెగబడ్డాడు. వద్దని గింజుకుంటున్న బలవంతంగా పట్టుకుని మొఖానికి కేక్ పూశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాలిక తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. అతనిపై పొక్సో యాక్ట్, సెక్షన్ 354ప్రకారం కేసు ఫైల్ చేశారు.
56ఏళ్ల ఆ టీచర్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. బలవంతంగా పట్టేసుకుని కేక్ పూయాలని ప్రయత్నిస్తుండటంతో విడిపించుకోవడానికి బాలిక తీవ్రంగా ప్రయత్నించింది. ‘నిన్నెవరు కాపాడతారు.. ఎవరైనా వచ్చారా’ అంటున్న మాటలు వీడియోలో రికార్డు అయ్యాయి.
అతనిపై ముందుగానే యాక్షన్ తీసుకున్న స్కూల్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఇదంతా స్కూల్ పరిసరాల్లో జరిగిన ఘటన కాదని తేల్చేసింది. టీచర్స్ డే సందర్భంగా కోచింగ్ సెంటర్ లో ఈ ఘటన జరిగిందని వివరించింది.
Read Also: Social Media : ఆన్‌లైన్ ఫ్రెండ్‌ని నమ్మి వెళితే అఘాయిత్యం చేసి.. అశ్లీల వీడియోలు తీశాడు
మరో ఘటనలో యూపీలోని స్కూల్ హెడ్ మాస్టర్ నాలుగో తరగతి చదివే తొమ్మిదేళ్ల విద్యార్థికి అశ్లీల వీడియోలు చూపించి అత్యాచారానికి పాల్పడ్డాడు. స్కూల్లోనే ఓ గదిలోకి పిలిచి వీడియో చూపించాడు. ఆ తర్వాత గది లోపలి నుంచి లాక్ చేసి బాలిక ఏడుస్తున్నప్పటికీ వదలకుండా అడ్డుకున్నాడు.